బిజినెస్

మ్యూచువల్ ఫండ్స్ ఖాతాలు రూ.8.53 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: గడచిన ఆగస్టు మాసంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కొత్తగా 5లక్షల మదుపరుల ఖాతాలను సంతరించుకుంది. తద్వారా మొత్తం మదుపర్ల ఖాతాలు 8.53 కోట్లకు చేరాయి. మార్కెట్ల అనిశ్చితిలోనూ ఈ పరిశ్రమలో ప్రగతి చోటుచేసుకోవడం విశేషం. జూలైలో ఈ పరిశ్రమకు 10.29 లక్షల కొత్త మదుపరుల ఖాతా (్ఫలియోలు) సమకూరింది. ఇందులో ఒక్కో మదుపరికి బహుళ ఫోలియోస్ ఉండే అవకాశాలున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాల మేరకు ఆగస్టులో 44 ఫండ్ హౌస్‌ల్లో ఫోలియోల సంఖ్య 8,52,81.222కు పెరిగింది. అంతకు క్రితం నెలలో ఈ సంఖ్య 8,48.00.409గా ఉండేది. అంటే 4.81 లక్షల ఫోలియోస్ అదనంగా సమకూరాయి. జూన్‌లో మొత్తం ఫోలియోల జాబితా 8.23 లక్షలుగా ఉండేది. ఈ పరిశ్రమలో పెట్టుబడులను మదుపర్లు సురక్షితంగా భావించారని విశే్లషకులు పేర్కొంటున్నారు. కాగా ఆగస్టు చివరికి ఈక్విటీ, ఈక్విటీ అనుబంధ పొదుపు పథకాల్లో ఫోలియోస్ సంఖ్య 4.11 లక్షలు పెరిగి మొత్తం 6.16 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో 6.12 కోట్ల ఫోలియోస్ సమకూరాయి. కాగా రుణ ప్రాదిపదికగల పథకాల్లో ఫోలియోస్ కౌంట్ 1.15 లక్షల వృద్ధితో మొత్తం సంఖ్య 66.75 లక్షలకు చేరింది. రుణ కేటగిరీలో ద్రవ్య నిధులు చార్ట్‌లో అగ్ర స్థానాన్ని ఆక్రమించాయి. ఇలావుండగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తుల విలువ ఆగస్టులో 24.53 లక్షల కోట్ల నుంచి 25.47 లక్షల కోట్లకు పెరిగింది.