బిజినెస్

ఆర్ అండ్ బీకి ఆర్థిక మాంద్యం దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖకు తాజా బడ్జెట్‌లో తొలిసారిగా ఆర్థిక మాంద్యం దెబ్బతగిలింది. బడ్జెట్‌లో కేవలం రూ.1411 కోట్ల నిధులను ఈ శాఖకు కేటాయించారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.2176 కోట్ల నిధులను కేటాయించారు. ఆరునెలల్లో ఈ శాఖకు కేటాయించిన నిధులను రూ.765 కోట్ల మేరకు తగ్గించి రూ.1411 కోట్లకు కుదించారు. ఈ శాఖకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో గతంలో కంటే ఎక్కువగా అదనంగా రూ.1000 కోట్ల నిధులను కేటాయిస్తారని భావించారు. దీంతో ఈ ఏడాది ఈ శాఖలో అభివృద్ధికి నిధులు ఖర్చుపెట్టడం కత్తిమీద సాము లాంటిదే. కేటాయించిన బడ్జెట్‌లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఉద్యోగుల వేతనాలకు సరిపోతాయి. కాగా ఈ ఏడాది డిసెంబర్ నెలలో బడ్జెట్‌పై తాజాగా సమీక్షించి అవసరమైతే సవరించిన అంచనాలను పెంచుతామని ప్రభుత్వం ప్రకటించడం ఊరట కలిగించే అంశమని పేర్కొనవచ్చును.
ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టుగా భావించే 330 కి.మీ రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టుకు రూ. 15వేల కోట్లవుతాయని అంచనా. కేంద్రం నిధులతోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పం కనపడుతోంది. ఈ సారి ఆర్ అండ్ బీ శాఖ రోడ్ల అభివృద్ధికి రుణాలను తీసుకునే అవకాశం ఉంది. రుణాలు తీసుకోవాలంటే రాష్ట్రప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం రోడ్ల నిర్మాణం నిమిత్తం వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ. 2200 కోట్ల నిధులను రుణాలుగా తీసుకుంది. ఈ సొమ్మును వివిధ పనులకు చెల్లించింది. కొత్త రోడ్ల సంగతి ఎలా ఉన్నా, రోడ్ల మెయింటెనెన్స్‌కు కూడా ఆర్ అండ్ బీ నిధులను సమీకరించుకోవాల్సి ఉంటుంది. గత ఐదేళ్లలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో అదనంగా మూడు వేల కి.మీ పొడువు రోడ్లను నిర్మించారని ఆర్థిక సామాజిక అవుట్‌లుక్ 2019 సర్వేలో పేర్కొన్నారు. రాష్ట్రం అవతరించిన సమయంలో తెలంగాణలో పంచాయతీ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో 64,044 కి.మీ రోడ్లు ఉండేవి. ప్రస్తుం 67409 కి.మీ పొడువుకు పెంచారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో మొత్తం 27,521 కి.మీ పొడువు రోడ్లు ఉన్నాయి. ఇందులో మేజర్ జిల్లా రోడ్లు 12071 కి.మీ , ఇతర రోడ్లు 13,301 కి.మీ పొడువు ఉన్నాయి. రాష్ట్ర రహదారి కింద 2149 కి.మీ పొడువు రోడ్లు ఉన్నాయి. మొత్తం 15,201 కి.మీ సింగిల్ లైను, 11,271 కి.మీ డబుల్ లైన్ రోడ్లు, 707 కి.మీ నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో 23 జాతీయ రహదారులు ఉన్నాయి. వీటి పొడువు 3862 కి.మీ. ప్రతి వంద చ.కి.మీకు 3.44 కి.మీ జాతీయ రహదారులు రాష్ట్రంలో ఉన్నాయి. అదే జాతీయ స్థాయిలో కేవలం 3.02 చ.కి.మీ పొడువు రోడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో 1767 కి.మీ పొడువు 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించినట్లు సామాజిక ఆర్థిక అవుట్‌లుక్ సర్వేలో పేర్కొన్నారు.