బిజినెస్

లాభాల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. తొలుత లాభాలతో ఆరంభమై ఇంట్రాడేలో సుమారు 386 పాయింట్లు ఎగబాకి జోరుమీదున్న 30 షేర్ల సూచీ సెనె్సక్స్ మధ్యాహ్నం తర్వాత నేలచూపులు చూసి 166.54 పాయింట్ల నష్టాల్లోకి జారుకుంది. కీలక స్థూల ఆర్థికాభివృద్ధి గణాంకాలు విడుదలవుతున్న నేపథ్యంలో మదుపర్లు ఇప్పటి వరకు వచ్చిన లాభాలను స్వీకరించి వేచిచూసే ధోరణిని అవలంభించారు. ఈ క్రమంలో సెనె్సక్స్ 0.45 శాతం నష్టాలతో 37,104.28 పాయింట్ల దిగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 52.90 పాయింట్లు కోల్పోయి 0.48 శాం నష్టాలతో 10,982.80 పాయింట్ల దిగువన స్థిరపడింది. ద్రవ్యోల్బణం, పరిశ్రమల వృద్ధిరేటు గణాంకాలను పరిశీలించిన దేశీయ మదుపర్లు జాగరూకతతో వ్యవహరించారని వాణిజ్యవర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా ఉత్పత్తుల దిగుమతులపై అదనపు సుకాల విధింపును 15 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం చల్లారవచ్చన్న ఆశాభావం మదుపరుల్లో నెలకొంది. అలాగే చైనా సైతం అమెరికాకు సంబంధించిన 16 కేటగిరీల ఉత్పత్తులపై పన్నును మినహాయిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. వచ్చే నెలలో ఈ రెండు దేశాల మధ్య మరోవిడత వాణిజ్య చర్చలు జరుగనున్న క్రమంలో ఇరు దేశాల తాజా వైఖరి మదుపరుల సెంటిమెంటుపై సానుకూలంగా మారింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్ బ్యాంక్ అత్యధికంగా 5.10 శాతం నష్టపోయింది. అలాగే టాటా మోటార్స్, మారుతి సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఆర్‌ఐఎల్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ 4.76 శాతం నష్టపోయాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌పార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ 2.13 శాతం లాభపడ్డాయి. రానున్న సవరించిన వృద్ధిరేటు గణాంకాలు బలహీనంగా ఉంటే వచ్చే నెలలో జరిగే ఆర్బీఐ విధాన నిర్ణయ సమావేశంలో మరో విడత రేట్ల కోతకు దారితీయవచ్చని విశే్లషకులు చెబుతున్నారు. కాగా బీఎస్‌ఈలో వాహన, టెలికాం, విద్యుత్, చమురు, సహజవాయువులు, స్థిరాస్తి, వినిమయాలు, టెక్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల సూచీ లు 1.92 శాతం నష్టపోయాయి. ఫైనాన్స్, బ్యాం కెక్స్, కేపిటల్ గూడ్స్, వౌలిక పరికరాల రంగాలు 0.35 శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్ 0.45 శాతం నష్టపోగా, స్మాల్‌క్యాప్ 0.12 శాతం లాభపడింది. ఇక ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్, నిక్కీ లాభాలు నమోదు చేయగా, హ్యాంగ్‌సెంగ్ నష్టాల్లో ముగిసింది. ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలతోనే సాగాయి. రూపాయి మారకం విలువ 34 పైసలు బలపడి అమెరికన్ డాలర్‌కు రూ. 71.32 వంతున ట్రేడైంది. ఇక ముడిచమురు ధరలు ఒక శాతం తగ్గి బ్యారెల్ 60.18 డాలర్ల వంతున ట్రేడైంది.