బిజినెస్

వాణిజ్య లోటు తొలగాలి భారత్‌లో పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, కొనసాగించేందుకు అమెరికన్ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్ల పట్ల, అలాగే ఇక్కడ ఆ దేశానికి ఉన్న వాణిజ్యలోటు పట్ల అమెరికా అసంతృప్తిని వ్యక్తం చేసింది. శుక్రవారం నాడిక్కడ జరిగిన ‘్భరత-అమెరికా ఆర్థిక శిఖరాగ్ర సదస్సుకు అమెరికన్ వాణిజ్య వ్యవహారాల శాఖ మినిస్టర్ కౌనె్సలర్ ఐలీన్ నంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ అమెరికా-్భరత వాణిజ్య సీఈవోల ఫోరంతో చర్చించిన మీదట ఇరు దేశాల మధ్య వాణిజ్య సమస్యలు పరిష్కారం అవుతాయని, సమతుల్యత నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వ గణాంకాల మేరకు అమెరికాకు భారతదేశ ఎగుమతులు 2018-19లో 52.4 బిలియన్ డాలర్ల మేర జరిగాయని, అలాగే 35.55 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయని తెలిపారు. ఈక్రమంలో ఈఏడాది ఇరుదేశాల మధ్య వాణిజ్యలోటు 16.85 బిలియన్ డాలర్ల మేర నెలకొందన్నారు. భారత్‌తో అమెరికా ద్వైపాక్షిక బంధాలు విస్తృతంగాను, నిర్మాణాత్మకంగానూ సాగుతున్నాయని, ఇటీవలి కాలంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం సైతం ఏ యేటికాయేడు వృద్ధిచెందుతూనే ఉన్నాయని నంది తెలిపారు. ఐతే ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య లోటును పూడ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2018లో రెండు దేశాల మధ్య టూవే ట్రేడింగ్ 142 బిలియన్ డాలర్ల మేర జరిగిందని, 2019 జనవరిలో ద్వైపాక్షిక వాణిజ్యం 10.5 శాతం పెరిగిందని ఆమె వివరించారు. అలాగే భారత్‌లో పెట్టుబడులు కొనసాగించే విషయంలో అమెరికన్ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా అందరికీ తెలిసినవేనన్నారు. అంతర్గత నియంత్ర కలిగిన భారత-అమెరికా సీఈవోల ఫోరం ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరిస్తుందన్న ఆశాభావం ఉందన్నారు. అమెరికాలో భారత్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు పెద్దసంఖ్యలో పెట్టుబడులకు ముందుకు వస్తుండటంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య వృద్ధి చోటుచేసుకుంటోందని సదస్సు అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఐలీన్ నంది పేర్కొన్నారు. అలాగే 2022 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు పెరగాలన్న లక్ష్యం ఉందని భారత-అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ జాతీయ అధ్యక్షుడు ఎస్‌కే సర్కార్ పేర్కొన్నారు.