బిజినెస్

సీఎంల అభిప్రాయాలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత 15వ ఆర్థిక కమిషన్ నిబంధనల మార్పుపై ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హితవు పలికారు. ఏకపక్ష నిర్ణయాలు సమాఖ్య సిద్ధంతానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. 3ఆర్థిక కమిషన్ - రాష్ట్రాలపై ప్ర భావం2 అనే అంశంపై శనివారం ఇక్కడ జ రిగిన సదస్సులో పాల్గొన్న మన్మోహన్ మా ట్లాడుతూ ఈ ఏడాది జూలై మాసంలో 15వ ఆర్థిక కమిషన్ నిబంధనలను కేంద్రం మా ర్చిందని గుర్తుచేశారు. ఆంతరంగిక భద్రత, రక్షణకు మురిగిపోని రీతిలో నిధుల కేటాయింపుపై ఆర్థిక కమిషన్ నిబంధనలను మార్చారని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలను అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతే తీసుకొని, అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ముఖ్యమంత్రుల సమాఖ్య మద్దతు ఉండాలని మన్మోహన్ డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ మాదిరిగానే ఆర్థిక కమిషన్‌ను కూడా సీఎంల సమాఖ్య పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీపై ఎన్‌కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక మండలి చేసిన ప్రతిపాదనలు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలవుతాయన్న విషయాన్ని మన్మోహన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. నిజానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే 15వ ఆర్థిక మండలి సిఫార్సులను ఖరారు చేయాలని ఆయన కేంద్రానికి స్పష్టం చేశారు.

చిత్రం... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్