బిజినెస్

రూ. 1,841 కోట్ల వాటాల కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఈనెల తొలిపక్షంలో విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 1,841 కోట్ల విలువైన వాటాలను మనదేశీయ ప్రధాన మార్కెట్ల నుంచి కొనుగోలు చేశారు. గత రెండేళ్ల కాలంగా కేవలం ప్రధాన విక్రయదారులుగా ఉన్న ఎఫ్‌పీఐల వైఖరిలో తాజాగా మార్పు వచ్చింది.
ఆర్థికాభివృద్ధి చర్యలను కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానంతోబాటు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతుండటం కూడా మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపిందని అంటున్నారు. తాజా డిపాజిటర్స్ డేటాప్రకారం గడచిన 15 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 2,031.02 కోట్ల విలువైన వాటాలను ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోగా, రూ. 3,872.19 కోట్ల విలువైన వాటాలను రుణ మార్కెట్లలో కొనుగోలు చేశారు. అంటే ఈకాలంలో రూ. 1,841.17 కోట్ల విలువైన అదనపు వాటాల కొనుగోళ్లు జరిగాయి. ఇలావుండగా ఆగస్టులో ఎఫ్‌పీఐలు రూ. 5,920.02 కోట్ల విలువైన వాటాలను, జూలైలో రూ.2,985.86 కోట్ల విలువైన వాటాలను ప్రధాన మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. కాగా భారత్ ప్రపంచంలోనే విదేశీ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశంగా మారిందని, సమీప కాలంలోనూ, భవిష్యత్తులోనూ ఈ పరిస్థితిలో మరింత ప్రగతి చోటుచేసుకునే అవకాశాలున్నాయని ప్రముఖ విశే్లషకుడు అరిందామ్ చంద్ర పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాగే సంస్కరణాత్మక విధానాన్ని కొనసాగిస్తే కార్పొరేట్ రంగంలో అభివృద్ధి తథ్యమని ఆయన తెలిపారు.