బిజినెస్

టోకు ద్రవ్యోల్బణ గణాంకాలతో మార్కెట్లు ప్రభావితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఈవారం వెలువడనున్న టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ వాణిజ్య స్థితిగతులు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు మూడోదఫా కేంద్ర ప్రభుత్వం ప్రభు త్వం ప్రకటించిన ఆర్థికాభివృద్ధి చర్యలు సైతం మార్కెట్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎగుమతులు, స్థిరాస్తి రంగాలకు ఊతం ఇచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత శనివారం దాదాపురూ.70వేల కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించడం జరిగింది. అలాగే నిరర్థక ఆస్తుల పునరుద్ధరణ నిమిత్తం రూ. 30వేల కోట్లు ఖర్చుకాగలిగే ప్రణాళికను రూపొందించనున్నట్టు తెలిపారు. ఆరేళ్ల కనిష్టానికి చేరిన ఆర్థికాభివృద్ధిని గాడిలో పెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్థికాభివృద్ధికే ప్రభుత్వ ప్రాధాన్యత అన్న విషయంపై స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. గృహ నిర్మాణం, వస్రాల ఎగుమతులకు ప్రోత్సాహం లభించేలా చేపట్టిన ప్రభుత్వం చర్యలవల్ల ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతాయని, కారణం ఈ రెండు రంగాలూ కార్మిక ప్రాధాన్యత కలిగినవేనని విశే్లషకులు చెబుతున్నారు. ప్రత్యేకించి కాలం చెల్లిన నిరర్ధకేతర (నాన్ ఎన్‌పీఏ), జాతీయ కంపెనీ లాట్రిబ్యునల్ పరిధిలో లేని (నాన్ ఎన్‌సీఎల్‌టీ) గృహ నిర్మాణం వంటి ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు రూ. 10వేల కోట్లు నిధులను కేటాయించడం అభినందనీయమని ప్రముఖ విశే్లషకుడు వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. కాగా సౌదీ అరేబియాలోని రెండు భారీ చమురు ప్లాంట్లపై యమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడులకు పాల్పడిన క్రమంలో మధ్య, తూర్పు దేశాల్లో ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. దరిమిలా సౌదీ ప్రాంతంలోని దాదాపు సంగానికిపైగా చమురు క్షేత్రాల ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడి చమురు ధరలు పెరిగాయి. దీంతో భారత్ వంటి ప్రధాన చమురు దిగుమతిదారులకు కష్టనష్టాలు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 60 డాలర్లు పలుకుతోంది. అంతేకాకుండా సోమవారం వెలువడనున్న డబ్ల్యుపీఎల్ ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని అంటున్నారు. ప్రధానంగా ఆహార, ఇంధన ద్రవ్యోల్బణాన్ని ఈ గణాంకాలు ప్రతిఫలిస్తాయి. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధాల క్రమంలో ప్రస్తుతం మదుపర్ల దృష్టి ఆ గణాంకాల వైపు మళ్లిందని మరో విశే్లషకుడు ముస్త్ఫా నదీం అభిప్రాపడుతున్నారు. అలాగే డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ పెట్టుబడుల రాకను సైతం మదుపర్లు గమనిస్తున్నారని ఆయన చెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లకోత, ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఆర్థిక ప్రాజెక్టులు, సరళతమవుతున్న అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ఈ వారం దేశీయ మార్కెట్లకు ఊతంగా మారే అవకాశాలున్నాయంటున్నారు. గతవారం మొత్తం సెనె్సక్స్ 403.22 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే.