బిజినెస్

పెట్రో ధరలు పైపైకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: సౌదీ అరేబియాలోని అరమ్‌కో రిఫైనరీపై జరిగిన డ్రోన్ దాడి మూలంగా మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ఐదు నుంచి ఆరు రూపాయలు పెరుగుతోంది. వచ్చే వారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలున్నాయని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం తదితర చమురు సంస్థల అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. యెమెన్ ఉగ్రవాదులు సౌదీ ప్రభుత్వానికి చెందిన అరమ్‌కో రిఫైనరీపై గత వారం జరిపిన డ్రోన్ దాడుల మూలంగా 5.7 మిలియన్ బ్యారల్ల చమరు ఉత్పత్తి తగ్గిపోయింది. దీని పర్యవసానంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దాదాపు ఇరవై శాతం పెరిగిపోయాయి. వచ్చే వారం చమురు ధరలు మరింత
పెరుగుతాయని చమురు సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న చమురు ధరలను దృష్టిలో పెట్టుకుని దేశంలో పెట్రోలియం, డీజిల్ ధరలను పెంచవలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన చమురు ధరలను దృష్టిలో పెట్టుకుని మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచవలసిన అవసరం ఉన్నదని చమురు సంస్థలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల ఆధారంగా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచే అధికారం చమురు సంస్థలకు ఉండడం తెలిసిందే. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్రోలు, డీజిల్ ధరలు పెంచటం గురించి చమురు సంస్థలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలను లీటరుకు ఐదు నుంచి ఆరు రూపాయల వరకు పెంచటం చిన్న విషయం కాదు కాబట్టి దీని గురించి ప్రభుత్వంతో కూడా చర్చలు జరపవలసి వస్తోందని చమురు సంస్థల అధికారులు చెబుతున్నారు. అరమ్‌కో చమురు క్షేత్రంపై డ్రోన్ల దాడులు జరిగిన తరువాత అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు బ్యారెల్ ధర 71 డాలర్లకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయని చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా ఉంటే ప్రపంచంలోని రెండవ అతిపెద్ద చమురు శుద్ధి కార్మాగారమైన అరమ్‌కో దాడికి కుట్ర చేసిన దేశంపై పగ తీర్చుకునేందుకు సౌదీ అరేబియా సిద్ధమవుతోందని చెబుతున్నారు. అరమ్‌కోపై జరిగిన డ్రోన్ దాడుల వెనక ఇరాన్ లేదా ఇరాక్ ఉన్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయటం తెలిసిందే. అరమ్‌కోపై దాడికి పాల్పడిన వారిని సౌదీ ఆరేబియా అధికారికంగా గుర్తించిన అనంతరం తదుపరి చర్యను నిర్ణయిస్తామని ట్రంప్ చెబుతున్నారు. సౌదీ అరేబియా కూడా ఆరమ్‌కో డ్రోన్ దాడుల వెనక ఇరాన్ హస్తం ఉన్నదని నిర్ధారించే పక్షంలో అమెరికా ఆ దేశంపై దాడికి దిగే అవకాశాలున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడి జరిగే పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
*గత శనివారం జరిగిన ద్రోన్ దాడిలో తగులబడుతున్న అరమ్‌కో రిఫైనరీ (ఫైల్)