బిజినెస్

చమురు ధరల చావుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటిన క్రమంలో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఏకంగా 642.22 పాయింట్లు నష్టపోయింది. ఓవైపు దేశంలో ఆందోళన రేకెత్తిస్తున్న ఆర్థిక మాంద్యాన్ని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతుండగా పుండుమీద కారం చల్లినట్టు ఆకస్మికంగా వచ్చిపడిన ముడిచమురు ధరల బాదుడు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో మోటారు వాహనాలు, బ్యాంకింగ్, తయారీ రంగాల్లో భారీగా వాటాల విక్రయాలు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచే నష్టాల పరంపర ఆరంభం కావడంతో ఏకంగా 704 పాయింట్లు కోల్పోయిన 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత స్వల్పంగా కోలుకుని 1.73 శాతం నష్టాలతో 36,481.09 పాయింట్ల దిగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 185.90 పాయింట్ల (1.69శాతం) భారీ నష్టాన్ని కూడగట్టుకుంది. 10,817.60 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్ఢిరపడింది. సెనె్సక్స్ చార్ట్‌లో హీరోమోటోకార్ప్, టాటామోటార్స్, మారుతి, టాటాస్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ అత్యధికంగా 6.19 శాతం నష్టపోయాయి. అలాగే బీఎస్‌ఈలోని 30 వాటాల్లో హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ మాత్రమే లాభాలను సంతరించుకున్నాయి. సౌదీలోని ప్రపంచంలోకే అతిపెద్ద చమురు ప్రాసెసింగ్ క్షేత్రాలపై డ్రోన్ దాడులు చోటుచేసుకున్న క్రమంలో నెలకొన్న చమురు సంక్షోభం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో భారీగా పెరిగే ముడిచమురు ధరలు మనదేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయవచ్చన్న అంచనాలు వెలువడటంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. మన దేశ అవసరాలకు ప్రస్తుతం 70 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో మదుపర్లు పెట్టుబడులను బంగారం వంటి ఇతర రంగాలపైకి మళ్లించారు. అంతర్జాతీయ మార్కెట్లలో సోమవారం ఏకంగా 20 శాతం పెరిగిన ముడిచమురు థరలు మంగళవారం స్వల్పంగా దిద్దుబాటుకులోనై బ్యారెల్ 71.95 డాలర్ల నుంచి 67.97 డాలర్లుకు దిగివచ్చింది. ప్రస్తుతం భారీ స్థాయిలో పెరిగిన ముడిచమురు ధరలవల్ల దిగుమతి చార్జీలు మరింతగా పెరిగి ఇప్పటికే బలహీనంగా ఉన్న మనదేశ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉందని విశే్లషకులు పేర్కొంటున్నారు. లాభాల మార్జిన్లపై వత్తిడి పెరగడంతోబాటు ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేస్తుందని 3నోమురా2 అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం పెరిగిన ధరలు, తాజాగా మరో 37 పైసలు కోల్పోయిన రూపాయి మారకం విలువ ఆధారంగా ఆ సంస్థ అధ్యయనం సాగింది. ఇలావుండగా రాబోయే చైనా-అమెరికా వాణిజ్య చర్చల ఫలితాలపై, ఆర్‌బీఐ ద్రవ్య వినిమయ విధాన సమీక్షా సమావేశ నిర్ణయాలపై సైతం మదుపర్లు ప్రత్యేక దృష్టిని నిలిపారు. అంతేకాకుండా మంగళవారం నాడే పొద్దుపోయాక ఆరంభమైన అమెరికన్ ఫెడరల్ రిజర్వు విధాన నిర్ణాయక సమావేశం తీర్మానాలు సైతం ప్రపంచ మార్కెట్లకు కీలకం కానున్నాయి. కాగా ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్ నష్టాలతో ముగిశాయి. నిక్కీ, కోస్పి లాభపడ్డాయి. ఇక ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో మిశ్రమ ఫలితాలనే నమోదు చేశాయి.