బిజినెస్

ఈ-సిగరెట్లపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ-సిగరెట్ల ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాలను నిషేధించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఐబీ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు బ్రెజిల్ వెళ్లటం వలన నిర్మలా సీతారామన్ ఈ-సిగరెట్ల నిషేధం గురించి ప్రకటించవలసి వచ్చింది. ఈ-సిగరెట్ పూర్తి పేరు ఎలక్ట్రానిక్ నికొటిన్ డెలివరీ సిస్టమ్.. వీటి ఉత్పత్తి, పంపిణీ, విక్రయం, వినియోగం, ఎగుమతి, దిగుమతి,
నిల్వ చేయటాన్ని పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. ఈ-సిగరెట్లకు సంబంధించిన ప్రకటనలు జారీ చేయడాన్ని కూడా మోదీ ప్రభుత్వం నిషేధించింది. యువతపై పడుతున్న చెడు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ-సిగరెట్లను నిషేధించాలని నిర్ణయించినట్లు వివరించారు. అమెరికాలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఇతరులు దాదాపు 30 లక్షల మంది ఈ-సిగరెట్లను వినియోగిస్తున్నారు. ఇది ముందు ముందు తొమ్మిది వందల శాతం పెరగవచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి. భారత దేశంలో కూడా ఈ-సిగరెట్ల వినియోగం పెరుగుతోంది.. ఇదొక స్టైల్.. స్టేటస్‌గా మారుతోంది. సిగరేట్ తాగే అలవాటు నుండి బైట పడేందుకు ఈ-సిగరెట్లను ప్రోత్సహిస్తున్నామని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. అయితే ఈ సిగరెట్లు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం నాలుగు వందల రకాల బ్రాండ్లను విక్రయిస్తున్నారు, రకరకాల రుచులతో ఇవి వస్తున్నాయని నిర్మలా సీతారామన్ వివరించారు. వీటినుంచి బైటికి వచ్చే పొగలో అధిక మొత్తంలో నికొటిన్ ఉంటోంది. చుట్టుపక్కల వారిపై దీని ప్రభావం పడుతోందని ఆమె తెలిపారు. ఈ-సిగరెట్ల మూలంగా అమెరికాలో ఏడుగురు మరణించారని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ-సిగరెట్ల నిషేధానికి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ అవుతోందని ఆమె చెప్పారు. ఈ-సిగరెట్ తాగినా, సరఫరా చేసినా మొదటి తప్పుకు లక్ష రూపాయల జరిమానా లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రెండేళ్లు.. ఆ తరువాత తప్పు జరిగితే ఐదు లక్షల రూపాయల జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష లేదా రెండు శిక్షలూ పడతాయని మంత్రి వివరించారు. ఆర్డినెన్స్ జారీ కాగానే ఈ-హుక్కా పార్లర్లను మూసి వేయవలసి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ-సిగరెట్లను నిషేధించాలని ఐసీఎంఆర్ సిఫార్సు చేసిందని తెలిపారు. పలు ఇతర సంస్థలు కూడా ఈ-సిగరెట్లను నిషేధించాలని సూచించాయని అన్నారు. మన దేశంలో ఈ-సిగరెట్ల ఉత్పత్తి జరగటం లేదు.. ఇవి విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయని ఆమె అన్నారు.

*చిత్రం... ఢిల్లీలో బుధవారం విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జావడేకర్