బిజినెస్

విద్యుత్ వాహనాల తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: విద్యుత్ వాహనాల తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన తొలి కాన్స్యులేట్ బిజినెస్ మీట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విద్యుత్ వాహనాల తయారీ, వినియోగం తదితర అంశాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పైలెట్ స్టేట్‌గా నిలిచేలా పాలసీని సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఆటోమోబైల్ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయిందని, తిరిగి దీన్ని ఏపీలో పునరుద్ధరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పరిశ్రమల స్థాపన, వస్తుత్పత్తి, వాణిజ్యం తదితర రంగాల్లో ఏపీ తీసుకోబోయే నిర్ణయాలు, కార్యాచరణ వివరించే క్రమంలో తొలి మీట్‌ను విశాఖలో ఏర్పాటు చేశామని, ఇది నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కల్పించడంతో పాటు ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, అందుకు పారిశ్రామిక వేత్తల స్పందన తేటతెల్లమవుతుందన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో ప్రభుత్వ ప్రాధాన్యతలు పారిశ్రామిక వేత్తలకు వివరిస్తామని, ముఖ్యంగా ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో ఎటువంటి అభివృద్ధి సాధించాలన్నదానిపై కసరత్తు కొనసాగుతోందన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావాలని, దీనికి ప్రభుత్వం ఇతోదికంగా సహకరిస్తుందని విజ్ఞప్తి చేశారు. కేంద్రం మారీటైం పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో కూడా మారీటైం బోర్డును సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో సమానంగా తీరప్రాంతాన్ని కలిగి ఉన్న ఏపీలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు కీలకమని, ప్రస్తుతం 4నుంచి 5 మిలియన డాలర్ల మేర ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయన్నారు. తైవాన్,
వియత్నాం వంటి దేశాల మాదిరి ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులను మూడునాలుగు రెట్లు పెంచాలనుకుంటున్నట్టు తెలిపారు. దీనికోసం కేంద్ర మారీటైం బోర్డుతో కలిసి సరికొత్త ప్రణాళిక తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో సరికొత్త పారిశ్రామిక విధానానికి సంబంధించి కార్యాచరణ జరుగుతోందని, త్వరలోనే దీన్ని అమల్లోకి తెస్తామన్నారు. విశాఖలో అదానీ సంస్థ ఏర్పాటు చేసే ఐటీ పరిశ్రమ విషయంలో చర్చలు జరుగుతున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే పరిశ్రమల పేరిట భూములు తీసుకున్న వారి విషయంలో కూడా తమ ప్రభుత్వ వైఖరి స్పష్టంగానే ఉంటుందన్నారు. అతితక్కువ ధరకు భూములు పొందిన వారితో చర్చించి ధరలు సవరించనున్నట్టు తెలిపారు.
*చిత్రం... పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి