బిజినెస్

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : ఎట్టకేలకు ముడిచమురు ధరలు తగ్గడంతోబాటు రూపాయి మారకం విలువ బలపడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం పుంజుకున్నాయి. ప్రధానంగా విద్యుత్, ఇంధన, లోహ స్టాక్స్‌లో బాగా లాభపడ్డాయి. ఈక్రమంలో సెనె్సక్స్ 82.79 పాయింట్ల ఆధిక్యతతో 0.23 శాతం లాభపడి 36,563.88 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడగా, నిఫ్టీ 31.05 పాయింట్లు (0.29 శాతం) లాభపడి 10,848.65 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో టాటాస్టీల్, వేదాంత, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్ అత్యధికంగా 3.95 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, యెస్‌బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌పార్మా, మారుతి 2.08 శాతం నష్టాలను చవిచూశాయి. గత రెండు సెషన్ల నుంచి దాదాపు 2శాతం నష్టపోయిన ఈక్విటీలు చమురు ధరల పరుగుకు కళ్లెం పడటంతో బుధవారం సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రకటనతో కోలుకున్నాయి. డ్రోన్ దాడుల కారణంగా ఆగిపోయిన సుమారు సగం ముడిచమురు ఉత్పత్తులు మళ్లీ ప్రారంభమయ్యాయని సౌదీ ఇంధన మంత్రి ప్రకటించడం జరిగింది. అలాగే పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరుగుతుందని కూడా ఆయన తెలిపారు. ఈప్రకటన మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావాన్ని చూపింది. అలాగే ముడిచమురు ధరలు 0.95 శాతం తగ్గి బ్యారెల్ 63.94 డాలర్ల వంతున ట్రేడైంది. ఈక్రమంలో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం 52 పైసలు బలపడి ఇంట్రాడేలో 71.26 రూపాయల వంతున ట్రేడైంది. కాగా అమెరికన్ ఎన్నికల తర్వాత, లేదా ముందే అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం చోటుచేసుకునే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకూ ఊతం లభించింది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణాయక సమావేశం తీర్మానాలు ఎలా ఉంటాయన్న విషయంపై సైతం మదుపర్లు దృష్టి పెట్టారని విశే్లషకులు చెబుతున్నారు. ఇలావుండగా బుధవారం ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, నిక్కీ, కోస్పి మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. ఐరోపా స్టాక్ మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లోలాభాలనే నమోదు చేశాయి.