బిజినెస్

ముఖేష్ అంబానీ వాటాల శాతం పెరగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోప్రమోటర్, చైర్మన్ ముఖేష్ అంబానీ కొత్తగా వా టాలేవీ తీసుకోలేదని, అందువల్ల ఆయన వాటల్లో ఎలాంటి పెరుగుదలా లేదని గురువారం నాడిక్కడ ఆ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఓటింగ్ హక్కు లు, వాటాల పరిమితి మేరకు ప్రమోట్, ప్రమోట్ గ్రూప్‌నకు రూ. 309.8 కోట్ల విలువైన వాటాలున్నాయని, ఇది మొత్తం వాటాల్లో 48.87 శాతమని గడచిన జూన్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి స్టాక్‌ఎక్చేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో కంపెనీ స్ప ష్టం చేసింది. అసలు వాటాల కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి లావాదేవీలూ జరగలేదని, 41.29 కోట్ల సంపద వాటాలు, పెట్రోలియం ట్రస్టులో 24.09 కోట్ల వాటాలు, రిలయన్స్ అనుబంధ సంస్థ ల్లో 17.19 కోట్ల వాటాలు ఉన్నాయని కంపెనీ వివరించింది. ప్రస్తుతం జరుగుతున్న అనుబంధ కంపెనీల ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా 5 అనుబంధ కంపెనీలకు చెందిన 17.19 కోట్ల వాటాలు పెట్రోలియం ట్రస్టు నిర్వహణలోని రిలయన్స్ సర్వీసెస్, హోల్డింగ్స్‌లో విలీనం అయ్యాయని తెలిపింది.