బిజినెస్

5 శాతం లాభపడిన ఐఐఎఫ్‌ఎల్ వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న సంపద నిర్వహణ సంస్థ ఇండియా ఇన్ఫోలైన్ లిమిటెడ్ (ఐఐఎఫ్‌ఎల్)కు చెందిన వాటాలు గురువారం 5 శాతం లాభపడ్డాయి. ఐఐఎఫ్‌ఎల్ హోలింగ్స్ నుంచి విడిపోయిన తర్వాత తొలిరోజు ట్రేడింగ్‌లో ఇలా లాభపడటం గమనార్హం. తొలుత ఒక్కో వాటా రూ. 1,200 వంతున ఆరంభమైన ఈ వాటా విలువ వాణిజ్య సమయం ముగిసే సమయానికి 5 శాతం అదనంగా లాభపడి రూ. 1,270.50కు చేరింది. గత ఏడాది ఈ సంస్థ వాటా ధర రూ. 1,210గా ఉండేది. అప్పట్లో ఫైనాన్స్ సేవల సంస్ధ ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ తమ సంస్థ నుంచి ఫైనాన్స్, సంపద నిర్వహణ, కేపిటల్ బిజినెస్‌లకు చెందిన విభాగాలను మూడు ప్రత్యేక విభాగాలుగా విడదీస్తున్నట్టు ప్రకటించింది. కాగా వాణిజ్య విలువలను అనుసరించి బీఎస్‌ఈలో ఈ సంస్థకు చెందిన 1.55 లక్షల వాటాలు, ఎన్‌ఎస్‌ఈలో 17 లక్షల వాటాలు గురువారం ట్రేడయ్యాయి. అలాగే ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 10,725.91 కోట్లకు చేరింది.