బిజినెస్

ఐటీ ఫార్మా ఇండస్ట్రీస్‌కి కేంద్ర బిందువు హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ /గచ్చిబౌలి, సెప్టెంబర్ 19: ఐటీ ఫార్మా ఇండస్ట్రీకి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇండియా ల్యాబ్ ఎక్స్ ఫో అండ్ ఫార్మా ప్రో ప్యాక్ ఎక్స్ పో 2019ను వైద్య శాఖ మంత్రి ఈటల ప్రారంభించారు. ఈసందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు నాణ్యమైన వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు నగరంలో అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. నగర శివారు సుల్తాన్‌పూర్‌లో400 ఎకరాలలో మెడికల్ డివైస్ మానుఫ్యాక్చరింగ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నమని మరో 300 ఎకరాల భూమి కేటాయిం చి పరిశ్రమను విస్తరించన్నుట్లు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు విద్యుత్, పన్ను రాయితీలను ఇవ్వడంతో పాటు సకల వౌలిక సదుపాయలను కల్పిస్తున్నట్లు రాజేందర్ చెప్పారు. నాణ్యమైన విద్యుత్ 24 గంటలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఈటల తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ కంపెనీకి శంకుస్థాపన కూడా చేయ డం జరిగిందని ఈసందర్భంగా గుర్తు చేశారు. దేశంలోనే పరిశ్రమలకు భధ్రత కలిగిన ప్రాంతం హైదరాబాద్‌ని వివరించారు. పెట్టుబడులకు అత్యం త అనువైన వాతవరణం ఉన్న ఈప్రాంతంలో పరిశ్రమిక వేత్తలు తమ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. టీఎస్‌ఐ పాస్ ద్వారా పరిశ్రమలకు అన్ని అనుమతులను 15 రోజుల్లోనే ఇస్తున్నామని ఎలాం టి మధ్యవర్తులు దళారులు లేకుండా నేరుగా అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం అందించే రాయితీలను పొందాలని ఇక్కడ యువతిక ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్ర ఆర్ధిక పరిపుష్టికి తోడ్పాటును అందించాలని ఆటల కోరారు. ఈ కార్యక్రమంలో మెస్సి మన్‌చెన్ సీఈఓ భుపెందర్ సింగ్, ఐఏఐఏ ప్రెసిడెంట్ గౌతం రాజన్, ఐపీఎంఎంఏ ప్రెసిడెంట్ మహేందర్ మెహతతో పాటు ఏఏఐఐఎల్ సభ్యులు చక్రవర్తి, దీపక్ పటేల్, సతీష్‌లు పాల్గొన్నారు. ఎక్స్ పోలో దేశ విదేశాలకు చెందిన వైద్య రంగానికి చెందిన శస్త్ర చికిత్స పరికారాలు, యంత్రాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రదర్శన 21 వరకు కోనసాగుతుందని నిర్వహకులు తెలిపారు.
*చిత్రం...ఇండియా ల్యాబ్ ఎక్స్ ఫో అండ్ ఫార్మా ప్రో ప్యాక్ ఎక్స్ పో 2019ను ప్రారంభిస్తున్న మంత్రి ఈటల