బిజినెస్

స్వల్పంగా తగ్గిన వెండి, బంగారం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.170 తగ్గి మొత్తం ధర 38,390కి దిగివచ్చింది. రూపాయి విలువ బలపడటంతోబాటు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన కార్పొరేట్ పన్నుల వెసులుబాటుతో మదుపర్లు స్టాక్ మార్కెట్ల వైపు మళ్లారని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వెండి ధర సైతం కిలోపై రూ. 120 తగ్గి మొత్తం ధర రూ. 47,580కి దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల స్పాట్ బంగారం ధరలు సైతం పది గ్రాములపై రూ. 170 తగ్గింది. ఇందుకు కారణంగాప్రధానంగా రూపాయి విలువ 40 పైసలు బలపడటమేనని సీనియర్ విశే్లషకుడు తపన్‌పటేల్ తెలిపారు. ఇలావుండగా అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర 1,503 డాలర్లు వంతున, వెండి ఔన్సు ధర 17.87 డాలర్ల వంతున ట్రేడయ్యాయి.