బిజినెస్

ఆర్బీఐ నిర్ణయాల్లో కేంద్ర జోక్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 20: రిజర్వు బ్యాంక్‌కు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వమే రాజ్యాధికారాలు కలిగివుందని ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం నాడిక్కడ పే ర్కొన్నారు. ప్రభుత్వంతో సెంట్రల్ బ్యాంకు పలుమార్లు సంప్రదింపులు జరిపి కొన్ని నిర్ణయాత్మక అంశాలపై స్వేచ్ఛాయుత, బాధ్యతాయుత చర్చలకు ఆహ్వానించినప్పటికీ ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని దేశాల్లో ప్రభుత్వాలు, ద్రవ్య వినిమయ నిర్ణయాత్మక విభాగాలకు మధ్య పలు అంశాల్లో అభిప్రాయ భేదాలుండటం సర్వసాధారణమేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఐతే అలాంటి అంశాలపై కూర్చుని చర్చించి ఆమోదయోగ్యమైన తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకుల మధ్య పలు దఫాలు అంతర్గత చర్చలు జరిగాయని, ఐతే తుది నిర్ణయాలన్నీ కేవలం ఆర్బీఐ మాత్రమే తీసుకోవడం జరిగిందని, అందుకు అవసరమైన 100 శాతం స్వయంప్రతిపత్తి తమ బ్యాంకుకు ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘నా నిర్ణయాల్లో ఎవరూ జోక్యం చేసుకోరు’ అని ఆయన వ్యాఖ్యానించారు.