బిజినెస్

ఘాట్టెక్కిన ఉల్లి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 21: ఉల్లిపాయల ధరలు ఘాటెక్కాయి. వినియోగదారుల కంటి తడి పెట్టిస్తోంది. గత నెలలో కిలో రూ.20 నుండి రూ.25 ధరకు లభించిన ఉల్లిపాయలు క్రమేణా రేటు పెరుగుతూ రైతుబజారుల్లో కిలో రూ.35కి చేరాయి. అయినా రైతుబజారుల్లో అసలు ఉల్లిపాయలే లభించడం లేదు. ఏ షాపులోనూ ఉల్లిసాయలు కన్పించకపోవడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. పైగా సంచార వ్యాపారుల వద్ద రూ.60 నుండి రూ.65 పెట్టి కొనాల్సి వస్తుంది. గత వారంలో కురిసిన వర్షాల వల్ల కర్నూలు జిల్లాలోని వేలాది హెక్టారుల్లో చేతికి అందాల్సిన ఉల్లి సాగు పూర్తిగా దెబ్బతింది. దాంతో అక్కడ ఉల్లి సాగు రైతులకు నష్టాల ఊబిలో మునిగారు. పంటపోయి ఉల్లి రైతులు కంటతడి పెడుతుండగా ధరలు పెరిగిపోయి వినియోగదారులూ కంటతడి పెడుతున్నారు. నిత్యం వాడే గృహిణులు ఎలాగోలా వాటి వినియోగంలో ఎవ్వరికి వారే రేషన్ విధించుకున్నాగాని తోపుడు బండ్లు, బజ్జీల వ్యాపారులు, అల్పాహారశాల వినియోగదారులు, హోటళ్ల నిర్వాహకులు మాత్రం గిలగిల్లాడుతున్నారు. ఇంకా చిరు వ్యాపారులు అంటే సమోసాలు తయారు చేసుకుని జీవనం సాగించే వారు ప్రత్యామ్నాయంగా క్యాబేజీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదిలా ఉండగా రైతుబజారుల ఎస్టేట్ ఆఫీసర్లు మాత్రం ఉల్లిపాయల ఇండెంట్లు మాత్రం మార్కెటింగ్ శాఖ అధికారులకు పంపించామంటున్నారు. వినియోగదారులు మాత్రం ప్రభుత్వం తరపున నియంత్రణ ధరలతో ఉల్లిపాయలను రైతుబజారులో అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.