బిజినెస్

పిపిఎఫ్, పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31: పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర లాంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలు, సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 1.3 శాతం దాకా వడ్డీ రేటు తగ్గింపు శుక్రవారంనుంచి అమలులోకి రానుంది. ఏప్రిల్ 1నుంచి జూన్ 30 వరకు త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్)పై వడ్డీ రేటు 8.1 శాతంగా ఉంటుంది. ఇంతకు ముందు ఈ వడ్డీ రేటు 8.7 శాతంగా ఉండింది. అలాగే కిసాన్ వికాస్ పథ్రలపై వడ్డీ రేటును 8.7 శాతంనుంచి 7.8 శాతానికి తగ్గించగా, అయిదేళ్ల కాల పరిమితి ఉండే సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ పథకంపై ఇంతకు ముందున్న 9.3 శాతానికి బదులు 8.6 శాతం వడ్డీ లభిస్తుంది. కాగా, సుకన్య సమృద్ధి పథకంపై 9.2 శాతానికి బదులు ఇకపై 8.6 శాతం వడ్డీ లభిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఇంతకు ముందు ఏడాదికోసారి వడ్డీ రేట్లను నిర్ణయించనుండగా ఇకపై ప్రతి మూడు నెలకోసారి వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు.
పారు.