బిజినెస్

చిన్న, మధ్య పరిశ్రమల రంగాలకు మంచి రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో చిన్న, మధ్య పరిశ్రమలకు మంచి రోజులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమలకు అన్ని రకాలుగా ఆదుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ అన్నారు. శనివారం ఇక్కడ ఆయన ఇండియా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఫోరం సదస్సును నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభించిన ప్రధాన కార్యదర్శి జోషీ మాట్లాడుతూ పూల పండగ బతుకమ్మ వేడుకలు ప్రారంభం రోజునే చిన్న, మధ్య తరహా పరిశ్రమల సదస్సును నిర్వహించడం విశేషమన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల వౌలిక సదుపాయాలు కల్పిస్తోందని, ప్రోత్సాహకాలు ఇస్తోందన్నారు.
రాష్ట్రంలో అపారమైన మానవవనరులు ఉన్నాయని, తిరుగులేని శక్తిగా భారత్ ఎదిగేందుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉందన్నా రు. ప్రతి పరిశ్రమ ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. సాఫ్ట్‌వేర్, నూతన సాంకేతిక పరిష్కారాలను అమలు చేయాలన్నారు. ఫోరం అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ డిజిటలైజేషన్ టెక్నాలజీని సమకూర్చుకోవాలని చిన్న, మ ధ్య తరహా పరిశ్రమల యాజమాన్యాలను కోరా రు. డిజిటలైజేషన్ వల్ల దేశ స్థూల జాతీయోత్పత్తికి అందిస్తున్న 8శాతం సహకారం మరో మూడు రే ట్లు పెరుగుతుందన్నారు. ఉపాధి, ఉద్యోగావకాశా లు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బ్రాండ్, మార్కెటింగ్ నిపుణులు సీ చంద్రశేఖర్ రెడ్డ, పోరం ట్రస్టీ రవీందర్ భన్, ఫైనాన్సింగ్ నిపుణులు వినోద్‌కుమార్, తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు హేమ జైన్, మార్కెటింగ్ డైరెక్టర్ రోషని దాస్ తదితరులు హాజరయ్యారు.

*చిత్రం...ఇండియా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఫోరం సదస్సును ప్రారంభిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ