బిజినెస్

అక్టోబర్ 15లోగా బకాయిలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగా తన ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) విక్రేతలకు కాలాతీతమయిన చెల్లింపులను అక్టోబర్ 15వ తేదీలోగా చెల్లించాలని శనివారం ఆదేశించింది. వృద్ధి రేటుకు ఊతమివ్వడానికి కృషి చేస్తున్నందున అందుకు అనుగుణంగా మూలధన వ్యయం కేటాయింపులను పెంచాలని పీఎస్‌యూలను ఆదేశించింది. 32 మహారత్న, నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (సీపీఎస్‌ఈలు)ల అధిపతులతో మూలధన వ్యయం కార్యక్రమాన్ని సమీక్షించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో పెట్టుబడి కేటాయింపులను, వ్యయాన్ని పెంచవలసిందిగా ప్రభుత్వ రంగ కంపెనీలను ఆదేశించినట్టు తెలిపారు. సీపీఎస్‌ఈలను రానున్న నాలుగు త్రైమాసికాలకు సంబంధించి ఒక రోడ్‌మ్యాప్‌ను అక్టోబర్ 15లోగా సమర్పించాలని ఆదేశించినట్టు సమావేశానంతరం నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక వృద్ధి రేటును పెంచడానికి తీసుకోవలసిన చర్యలపై సాగిస్తున్న మేధోమథనంలో భాగంగా నిర్మలా సీతారామన్ వివిధ భాగస్వాములతో జరుపుతున్న వరుస సంప్రదింపుల్లో భాగంగా ఈ తాజా సమావేశం జరిగింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిదు శాతానికి పడిపోయింది. ‘పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటిని అక్టోబర్ 15లోగా చెల్లించాలని, అలాగే అక్టోబర్ 15లోగా అవన్నీ ఒక పోర్టల్‌ను కలిగి ఉంటాయని, ఆ పోర్టల్ ద్వారా అందరు డీలర్లు, కాంట్రాక్టర్లు తమ చెల్లింపులను పరిశీలించుకోవచ్చని నిర్ణయించడం జరిగింది’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘మధ్యవర్తి నిర్ణయాల తరువాత చెల్లించవలసిన వాటిలో 75 శాతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పటికి బ్యాంకు గ్యారంటీలు ఒక అవరోధంగా ఎందుకు తయారవుతున్నాయనే అంశంపై చర్చించడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), ఆర్థిక శాఖ కార్యదర్శి, ఎంపిక చేసిన అనేక సీపీఎస్‌ఈల సమావేశం జరుగనుంది. ఒకవేళ అదే జరిగితే, నేను ఆర్‌బీఐ సహాయం కోరుతాను’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.

*చిత్రం...న్యూఢిల్లీలో శనివారం మూలధన వ్యయం, చెల్లింపులు, సీపీఎస్‌ఈల వ్యవహారంపై జరిగిన సమావేశంలో
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర అధికారులు