బిజినెస్

ఉల్లి ఎగుమతులపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం వాటి ఎగుమతిపై నిషేధం విధించింది. వ్యాపారులు తమ వద్ద ఉంచుకునే ఉల్లి నిల్వలపై పరిమితి విధించింది. ఈ రెండు చర్యల ద్వారా దేశంలో ఉల్లి లభ్యతను పెంచడంతో పాటు వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని కేంద్రం భావిస్తోంది. రిటెయిల్ వ్యాపారులు వంద క్వింటాళ్ల వరకు, టోకు వ్యాపారులు 500 క్వింటాళ్ల వరకు మాత్రమే ఉల్లి నిల్వలను కలిగి ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. రహస్యంగా
ఉల్లిని నిల్వచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బంగ్లాదేశ్, శ్రీలంకకు కనీస ఎగుమతి ధర (ఎంఈపీ) కన్నా తక్కువ ధరకు ఎగుమతి చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని, నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్రం హెచ్చరించింది. ఉల్లి సరఫరాలను పెంచడానికి, ధర పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఆగస్టు నుంచి ఉల్లి ధర వేగంగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ ఆంక్షలు విధించింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో రిటెయిల్ ఉల్లి ధర కిలోకు రూ. 60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తడం వల్ల అక్కడి నుంచి ఉల్లి సరఫరాలకు అంతరాయం కలగడంతో ఉల్లి ధర ఇలా అమాంతం పెరుగుతూ పోతోంది. ‘మార్కెట్‌లో ఉల్లి అధిక ధరలు నిలకడగా కొనసాగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాని ధరలను నియంత్రించడానికి అనేక చర్యలు చేపట్టింది. వ్యాపారులు నిల్వ చేసే ఉల్లి నిల్వలపై పరిమితులు విధించడం, ఉల్లి ఎగుమతులను నిషేధించడం వంటివి వీటిలో ఉన్నాయి. ఉల్లిని అక్రమంగా నిల్వ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాయి’ అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది.