బిజినెస్

ఆర్టీపీపీలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 29 : రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. రోజుకు 1,650 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా 510 మెగావాట్లకు పడిపోయింది. బొగ్గు కొరత థర్మల్ కేంద్రాన్ని పట్టిపీడిస్తోందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. థర్మల్ కేంద్రంలో 6 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లు ఒకొక్కటి 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి. 6వ యూనిట్ గత ఏడాది ప్రారంభించబడి 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ 6వ యూనిట్‌తో పాటు మరో 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 3 యూనిట్లు మాత్రమే పని చేస్తున్నాయి. వీటి నుంచి 630 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా 510 మెగావాట్లు మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి అవుతోంది.
తీవ్రమైన బొగ్గు కొరత
రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రంలో బొగ్గుకొరత తీవ్రస్థాయికి చేరింది. 6 యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేసేందుకు రోజుకు 20 వేల టన్నుల బొగ్గు అవసరం. అయితే రాష్ట్రంలోని మహానది బొగ్గు గనుల నుంచి రావాల్సిన బొగ్గు పూర్తిగా నిలిచిపోయింది. ప్రతిరోజూ మహానది నుంచి 15 వ్యాగన్లు(16వేల టన్నులు), తెలంగాణలోని సింగరేణి నుంచి 3 వ్యాగన్ల (10,500టన్నులు) బొగ్గు వచ్చేది. కాగా ఒరిస్సా నుంచి బొగ్గు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అక్కడి బొగ్గు గనుల్లో కార్మికుల సమ్మె, రెండు వారాల నుంచి కురుస్తున్న అధిక వర్షాల వల్ల బొగ్గు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి వచ్చే 3వ్యాగన్లు మాత్రమే ప్రస్తుతం థర్మల్ కేంద్రానికి చేరుతోంది. అంతకుముందు నిల్వ ఉన్న లక్ష టన్నుల బొగ్గు కూడా వినియోగించామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బొగ్గు నిల్వ కేవలం 5వేల టన్నులకు చేరింది. బొగ్గు రవాణాకు అంతరాయం లేని సమయంలో దాన్ని శుద్ధి చేసి వినియోగించేవారు. ఇప్పుడు బొగ్గు కొరత ఏర్పడటంతో తెలంగాణ నుంచి వస్తున్న 3 వ్యాగన్ల బొగ్గును శుద్ధి చేయకుండానే ఎప్పటికప్పుడు వినియోగిస్తున్నారు. అందువల్లే, 3 యూనిట్లలో 600 మెగావాట్లు ఉత్పత్తి కావాల్సిన ఉండగా 510 మెగావాట్లకు తగ్గిపోయిందని సమాచారం. కావున రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తెలంగాణ నుంచి మరింత బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అలాగే ఒరిస్సా నుంచి ఏ కారణాల వల్ల బొగ్గు రవాణా నిలిచిపోయిందో సమీక్షించి వెంటనే పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.
*చిత్రం...రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్