బిజినెస్

మరోదఫా ఆర్బీఐ రెపోరేట్ల కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 29: వచ్చే శుక్రవారం జరిగే రిజర్వు బ్యాంకు ద్రవ్య వినిమయ విధాన సమీక్షా కమిటీ (ఎంపీసీ) సమావేశంలో మరోదఫా రెపోరేట్ల కోత జరిగే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కార్యరూపం దాల్చితే వరుసగా ఐదోసారి ఈ రేట్ల కోత జరిగినట్టవుతుంది. ఆరేళ్ల బలహీన వృద్ధిరేటును గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ఉద్దీపన చర్యలకు బాసటగా, ఈ పండుగ సీజన్‌లో బహుమతిగా ఆర్బీఐ ఈ రెపోరేట్ల కోత విధిస్తుందని అంటున్నారు. కాగా ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ రెపోరేటు (స్వల్పకాలిక సమీకరణ రేటు)లో గత జనవరి నుంచి 1.10 పర్సంటేజీ పాయింట్లను నాలుగు దఫాలుగా కోత విధించిన సంగతి తెలిసిందే. గత ఆగస్టులో జరిగిన నాలుగో దఫా ఎంపీసీ సమావేశంలో అనూహ్యంగా 35 బేసిస్ పాయింట్ల మేర 5.40 శాతానికి కోత విధించడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి తీసుకునే రుణాలపై తగ్గించిన రెపోరేట్ల అమలు చేయడం ద్వారా రుణాల పంపిణీని వేగవంతం చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. కాగాప్రభుత్వం తీసుకున్న కార్పొరేట్ పన్నుల్లో కోత వంటి ఉద్దీపన చర్యలతో దేశానికి ‘సరఫరా’ విభాగంలో నెలకొన్న వత్తిడి తగ్గుతుందని, ఐతే డిమాండ్‌ను భర్తీ చేయడం సవాలుగా మారుతుందని పేర్కొంటున్న ఆర్థిక నిపుణులు ఈలోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి బాసటగా ఈ దఫా ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో మరో ధపా 25 బేసిస్ పాయింట్ల రేట్ల కోత విధించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.