బిజినెస్

ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా ఆర్బీఐ నుంచి రూ. 30 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా రిజర్వు బ్యాంకు నుంచి మధ్యంతర డివిడెండ్‌గా రూ. 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కోరనుందని విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 3.3 శాతం లోటుతో నెలకొన్న వృద్ధిరేటును గాడిలో పెట్టేందుకే ప్రభుత్వం ఈ మధ్యంతర డివెండెంట్ సమీకరణపై దృష్టి పెట్టిందని ఆ వర్గాలు తెలిపాయి. రెవిన్యూ వసూళ్లలో ఆధునీకరణ చోటుచేసుకోవడం, ఆరేళ్ల కనిష్టానికి చేరిన 5 శాతం వృద్ధిరేటును గాడిలో పెట్టే చర్యల్లో మందగమనం వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ వత్తికి గురైంది. ‘అందుకే ఒక వేళ అససరమైతే ప్రభుత్వం రిజర్వు బ్యాంకును మధ్యంత డివిడెండ్‌గా రూ. 25వేల నుంచి 30 వేల కోట్ల రూపాయల వరకు కోరే అవకాశాలున్నాయ’ని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అంచనాలు వచ్చే జనవరి తొలివారంలో రూపుదిద్దుకోనున్నాయన్నారు. కాగా ఆర్బీఐ మధ్యంతర డివిడెంట్‌తోబాటు ఆర్థిక లోటును గాడిలోపెట్టే ఇతర అంశాలు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ఆ అధికారి తెలిపారు. ఇందులో ప్రధానమైనవి ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించుకోవడం, జాతీయ చిన్నతరహా పొదుపు నిధి (ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్)ని వినియోగించుకునేందుకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్న ఆలోచన సైతం ప్రభుత్వానికి ఉందని ఆ అధికారి తెలిపారు. గత ఏడాది రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి రూ 28000 కోట్లు మధ్యంతర డివిడెండ్‌గా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,000 కోట్లు చెల్లించింది. కాగా గత నెలలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో మొత్తం రూ. 1,76,051 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి విడతల వారీగా బదలాయించాలన్న నిర్ణయం తీసుకుంది. ఈమొత్తాన్ని 2018-1లో సమకూరిన రూ. 1,23,414 కోట్ల అదనపు నిధులతో కలిపి బోర్డు లెక్కించింది. అంతేకాక సవరించిన ఆర్థిక మూలధన మార్గదర్శకాలు (ఈసీఎఫ్)ను అనుసరించి మరో రూ. 52,632 కోట్ల అదనపు నిల్వలను సైతం గుర్తించడం జరిగింది. కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర ఆదాయంలో రూ. 1,23,414 కోట్లలో రూ. 28,000 కోట్లను ఈ ఏడాది మార్చిలో ఆర్బీఐ ప్రభుత్వానికి బదలాయించింది. ఈక్రమంలోప్రభుత్వానికి బడ్జెట్ అంచనాలు రూ. 90.00 కోట్లకంటే అధికంగా డివిడెండ్ల రూపంలో రూ. 95,414 కోట్ల మొత్తం సమకూరింది. అలాగే 2019-20 బడ్జెట్ అంచనాల్లో ఇప్పటి వరకు రూ. 7.10 లక్షల కోట్లు నిధుల సమీకరణ చేసింది. గత 2018-19లో జరిగిన 5.35 లక్షల కోట్లకంటే తాజా సమీకరణ అధికం. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో స్థూలంగా కేంద్రం 4.42 లక్షల కోట్లు సమీకరించింది. ఇది ఏడాది మొత్తం లక్ష్యంలో 62.3 శాతం. ఈక్రమంలో ఆరేళ్ల కనిష్టానికి చేరిన త్రైమాసిక వృద్ధిరేటు, 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిన నిరుద్యోగ సమస్యను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడులపై పన్నుకోతను విధించడంతోబాటు వివిధ ఉద్దీపన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), దేశీయ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (డీపీఐలు) మదుపుచేసే నిధులపై వచ్చే స్వల్పకాలిక, దీర్ఘకాలిక వౌలక లాభాలపై విధించిన అదనపుసర్‌చార్జీలను సైతం ఉపసంహరించుకోవడం జరిగింది.