బిజినెస్

రైలు ఆలస్యమైతే నష్ట పరిహారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: రైలు ఆలస్యమైందని ప్రయాణికులు తలలు పట్టుకోవాల్సిన పని ఇకపై ఉండకపోవచ్చు. రైల్వే అనుబంధ ఐఆర్‌సీటీసీ త్వరలో నూతన విధానానికి శ్రీకారం చుట్టనుంది. విదేశాల్లో తరహాగా గంట ఆలస్యమైనా.. రెండు గంటలు ఆలస్యమైనా పరిహారం చెల్లించాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. అయితే, మొట్టమొదటగా ఈనెల నాలుగో తేదీన ప్రారంభం కానున్న ఢిల్లీ-లక్నో తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఈ ‘స్కీం’కు శ్రీకారం చుట్టనుంది.
దీనికి సంబంధించి ఐఆర్‌సీటీసీ మంగళవారం తేజాస్ ఎక్స్‌ప్రెస్ వివరాలు వెల్లడించింది. తేజాస్ రైలు గంట ఆలస్యమైతే వంద రూపాయిలు, గంట నుంచి రెండు గంటలు ఆలస్యమైతే 250 రూపాయిలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. దేశంలోనే ఈ విధానం మొట్టమొదటిసారిగా తేజాస్ ఎక్స్‌ప్రెస్‌కు వర్తింపజేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. దీంతో పాటుగా 25 లక్షల రూపాయిల బీమా సౌకర్యం కూడా ప్రయాణికులకు ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణికులకు సంబంధించిన గృహోపకరణాలు చోరీకి గురైతే లక్ష రూపాయిల వరకు పరిహారాన్ని ఐఆర్‌సీటీసీ చెల్లిస్తుంది.
జపాన్, పారిస్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి విధానం అమల్లో ఉంది. రైలు ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఓ సర్ట్ఫికెట్‌ను రైల్వే వర్గాలు ఇస్తాయి. ఈ సర్ట్ఫికెట్ ఆధారంగా ఎవరైనా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు లేదా ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ సర్ట్ఫికెట్ ఆధారంగా పరీక్షా హాల్‌లోకి విద్యార్థులను అనుమతిస్తారు.