బిజినెస్

డిపాజిటర్ల బీమా కవరేజీని పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 7: బ్యాంకుల్లో డిపాజిటర్ల బీమా కవరేజీ పరిమితిని ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయలను మరింతగా పెంచాల్సిన తక్షణావసరం ఏర్పడిందని సోమవారం నాడిక్కడ విడుదలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయన నివేదిక సూచించింది.
ప్రధానంగా తాజాగా వెలుగుచూసిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) కుంభకోణం నేపథ్యంలో డిపాజిటర్ల రక్షణకు మరి న్ని చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఆ నివేదిక పేర్కొంది. ప్రతి బ్యాంకులో డిపాజిటర్‌కు లక్ష రూపాయల వంతున ‘డిపాజిటర్స్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్’ (డీఐసీజీసీ) బీమా కల్పిస్తోంది. అసలు, వడ్డీలతో కలిపి ఈ బీమా పథకం వర్తిస్తుంది. బ్యాంకుల విలీనం, లేదా లిక్విడేషన్ లేదా లైసెన్స్ రద్దైన నాటి నుంచే ఈ బీమా అమలులోకి వస్తుంది. ఈక్రమంలో పీఎంసీపై గత నెలలో రిజర్వుబ్యాంకు ఆరు నెలల పాటు అమలయ్యేలా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఖాతాదారులు సొమ్ము డ్రా చేసుకునే విషయంలో సైతం పరిమితులు విధించడంతోబాటు కొత్త డిపాజిట్ల సేకరణకు, రుణాల మంజూరుకు వీలులేకుండా చేసింది. ఈ బ్యాంకులో పలు అక్రమాలు చోటుచేసుకున్న క్రమంలో డిపాజిటర్ల భద్రతకు ప్రాథాన్యమిచ్చేలా విధానాన్ని సమీక్షించాలని ఎస్‌బీఐ నివేదిక సూచించింది. డీఐసీజీ బీమా కవరేజీని రెండు కేటగిరీలుగా విభజించి సేవింగ్స్ డిపాజిట్లపై ఒక లక్ష రూపాయలు (మొత్తం పద్దుల్లో 90 శాతం) , టర్మ్ డిపాజిట్లపై 2 లక్షల రూపాయలు (మొత్తం పద్దుల్లో 70 శాతం) ఉండేలా ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది. అలాగే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రొవిజన్ ఏర్పాటు చేర్పాటు చేయాలని సూచించింది.
ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఎలాంటి ఇతర భద్రతలూ లేని ప్రస్తుత తరుణంలో వయసుమీరిన వారు, విశ్రాంత ఉద్యోగులు అధికంగా బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్లపైనే ఆధారపడుతున్నారని నివేదిక గుర్తు చేసింది. ప్రతి డిపాజిటర్ బ్యాంక్ బాండ్లు కొనుగోలు చేసే విషయంలో ప్రత్యేక రాయితీలు పొందేలా చూడాలని తద్వారా ఆరు నెలలకోసారి గ్యారెంటీ కూపన్‌రేట్లు, పన్ను రాయితీ అందుకునేలా చూడాలని నివేదించింది.