బిజినెస్

కలిసొచ్చిన వర్షపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 7: గత పాతిక సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం ఆశాజనకంగా ఉండడంతో ఈ సారి ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
గత ఐదేళ్ళ సగటు కంటే కూడా ఈ సారి ఆహార ధాన్యాల ఉత్పత్తి 8.4 మిలియన్ టన్నుల మేర పెరిగే 140.57 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చునని ఓ నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా దాదాపు 84 శాతం ప్రాంతాల్లో రుతుపవనాలు సాధారణ స్థాయిలో కొన్ని చోట్ల కొంత మేర ఎక్కువగా నమోదైనట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని తెలిపింది. ఈ నివేదికను ఎన్‌బీఎస్‌సీ రూపొందించింది. వర్షాకాలంలో నాటే ఆహార ధాన్యాల ఉత్పత్తులు సగటు కంటే కూడా ఈ సారి ఎక్కువగానే ఉండవచ్చునని గత ఏడాది డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పంజాబ్ రైతులు బాస్మతీ పంటకు ప్రాధాన్యతనిచ్చారని తెలిపింది. బీహార్, ఒరిస్సా, కర్నాటకలో వరద నీరు తగ్గడం వల్ల రైతులు కొంత మేరకు కోలుకోగలిగారని, విత్తనాలు నాటడం ఆలస్యమైనా పంట దిగుబడి మాత్రం పెరిగిందని తెలిపింది. ఎకరానికి మొక్క జొన్నల సగటు దిగుబడి పెరగవచ్చునని, అయితే కొన్ని రకాల చీడల వల్ల మొత్తం ఉత్పాదకత 5.75 శాతం మేర తగ్గే అవకాశం ఉందని ఎన్‌బీహెచ్‌సీ అధినేత హనీష్ కుమార్ సిన్హా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఎకరానికి ఇతర ఆహార ఉత్పత్తుల దిగుబడి కూడా సరైన వర్షపాతం పుణ్యమా అని పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే పత్తి పంట విస్తీర్ణం ఉత్పాదకత కూడా వరుసగా 4.32, 9.99 శాతం పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. సోయాబిన్ పంట దిగుబడి కూడా 5.68 శాతానికి పెరిగే అవకాశం ఉన్నా, భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్పాదకత 17.72 శాతం తగ్గవచ్చని తెలిపింది.