బిజినెస్

20% లాభపడిన జేబీఎస్ ఆటో వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: వివిధ సంస్థల నుంచి 300 బస్సుల సరఫరా కోసం ఆర్డర్లు అందుకున్న జేబీఎస్ ఆటో సంస్థ వాటాలు బుధవారం 20 శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ఈ సంస్థకు చెందిన ఒక్కో వాటా రూ. 224.55 వంతున ట్రేడైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 19.98 శాతం వృద్ధితో రూ. 225.15 వంతున ట్రేడయ్యాయి. కాగా తమ కంపెనీకి ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టం (డీఐఎంటీఎస్), స్పైస్ జెట్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, నవీ ముంబయి మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ల నుంచి 300 బస్సులను సరఫరా చేసేందుకు ఆర్డర్లు వచ్చాయని బుధవారం జేబీఎస్ ఆటో సంస్థ వెల్లడించింది. వచ్చే 2020 మార్చి 31 నాటికి వచ్చిన అర్డర్లంటినీ కార్యరూపం దాలుస్తాయని కంపెనీ తన బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వివరించింది.