బిజినెస్

ముంబయి విమానాశ్రయంలో సుంకాల రహిత దుకాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 9: ముంబయి విమానాశ్రయంలో దుకాణాలకు సుంకాల రాయితీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ దుకాణాలకు జీఎస్‌టీ ఇన్‌పుట్ పన్ను రీఫండింగ్‌ను నిరాకరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్ను విభాగం జారీ చేసిన ఆదేశాలను బుధవారం ముంబయి హైకోర్టు కొట్టి వేసిం ది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను తిరిగి పొందేందుకు ఆ దుకాణాలకు అర్హత ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఒక దేశం - ఒక పన్ను విధానం అమలులో ఉంది కాబట్టి స్థానిక పన్నులు వేయడం ద్వారా విదేశీ వర్తక వాణిజ్యాన్ని దెబ్బతీయడం అవుతుందని హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ రంజిత్ మోర్, భారతి డాంగ్రే అభిప్రాయపడుతూ ముంబయి సేల్స్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ ఈ ఏడాది జనవరి 10న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టి వేశారు.