బిజినెస్

ప్రపంచ ఆర్థికాభివృద్ధి పోటీలో 10 స్థానాలు కోల్పోయిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/జనీవా, అక్టోబర్ 9: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్థికంగా బలపడి పోటీలో దూసుకువెళుతుంటే మనదేశం మాత్రం ఈ పోటీలో వెనుకబడిపోతోంది. ఆర్థికాభివృద్ధి పోటీలో ఈ ఏడాది ర్యాకింగ్స్‌లో 10 స్థానాలు కోల్పోయిన భారత్ 68వ స్థానానికి పడిపోయింది. ఈ విషయంలో సింగపూర్ వేగంగా ముందుకెళుతోంది. అమెరికాను సైతం వెనక్కు నెట్టి అగ్ర స్థానాన్ని ఆక్రమించిన సింగపూర్ ‘ప్రపంచ నంబర్ వన్ ఆర్థికాభివృద్ధి పోటీనిచ్చే దేశం’గా ఆవిర్భవించింది. గతంలో జెనీవాకు చెందిన ‘ప్రపంచ ఆర్థిక ఫోరం’ (డబ్ల్యుఈఎఫ్) తన వార్షిక ర్యాకింగ్స్‌లో భారత్‌కు 58వ స్థానాన్ని కేటాయించడం జరిగింది. కాగా తాజా ర్యాంకింగ్స్‌లో భారత్‌తోబాటు ఆర్ధికాభివృద్ధి పోటీలో దారుణంగా వెనుకబడిన దేశంగాబ్రెజిల్ (71వ ర్యాంకు) గణుతికెక్కింది. గతంలో ఉన్న ఆర్థికాభివృద్ధి, కార్పొరేట్ కంపెనీల ఫలితాలు, మార్కెట్ల తీరును అనుసరించి భారత్‌కు 58వ స్థానాన్ని ఇచ్చామని, ఐతే ఇప్పుడా పరిస్థితి మారిందని ప్రపంచ ఆర్థిక ఫోరం బుధవారం నాడిక్కడ స్పష్టం చేసింది. లోతైన ఆర్థిక రంగ వ్యవస్థ కలిగిన భారత్ తాజాగా ఒడిదుడుకులకు గురైందని, ఆ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ బలహీన పడిందని డబ్ల్యుఈఎఫ్ వివరించింది. కాగా కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో భారత్ ఇప్పటికీ ఉన్నతమైన 15వ స్థానంలో ఉందని, అలాగే మదుపర్ల (షేర్‌హోల్డర్ల) పాలన విషయంలో సైతం ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని, మార్కెట్ విస్తృతిలో భారత్ మూడో స్థానంలో ఉందని, అలాగే పునరుత్పాదక శక్తి విషయంలోనూ అదే స్థానంలో కొనసాగుతోందని తాజా అధ్యయన నివేదిక తెలిపింది. అలాగే పరిశోధనల విషయంలో భారత్ ప్రగతిపథంలో సాగుతోందని, ఈ విషయంలో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే భారత్ ముందుందని, పలు అభివృద్ధి చెందిన దేశాలతో దీటుగా ముందడుగు వేస్తోందని స్పష్టం చేసింది. ఐతే ఇన్ని సానుకూలతలున్నప్పటికీ భారత్ సమాచార, కమ్యూనికేషన్, సాంకేతిక రంగాల్లో ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందడంలో పరిమిత స్థాయిలోనే ఉందని, అలాగే ఆరోగ్య పరమైన వాతావరణంలోనూ వైఫల్యం చోటుచేసుకుంటోందని, ఆరోగ్యప్రదమైన జీవితం గడపడంలోనూ భారత్‌లో తగినంతగా పరిస్థితులు లేవని ఆ నివేదిక వివరించింది.
ఈ విషయంలో భారత్ 141 దేశాల్లో 109వ ర్యాంకులో ఉందని వెల్లడించింది. ఆఫ్రికా ఖండం వెలుపల ఇదే అత్యల్ప స్థాయి అని, దక్షిణాసియా దేశాల సగటుకన్నా చాలా తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ఈ దిశగా భారత్ అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించింది. అలాగే తయారీ రంగంలోనూ సమర్థత కొరవడుతోందని, వాణిజ్య సంస్ధలు, కార్మిక మార్కెట్లు దుర్భర స్థితికి చేరాయని, కార్మిక హక్కుల రక్షణ, సంబంధిత ప్రభుత్వ విధానాలు తగినంతగా లేవని, ప్రధానంగా ఇందులో మహిళల భాగస్వామ్యం అతి స్వల్పంగా ఉందని డబ్యుఈఎఫ్ స్పష్టం చేసింది. కార్మికుల్లో స్ర్తి-పురుష నిష్పత్తి విషయంలో భారత్ 128వ ర్యాంకులో ఉందని తెలిపింది. అలాగే ప్రతిభను ప్రోత్సహించడం, ప్రోత్సాహకాలు కల్పించడంలోనూ 118వ ర్యాంకులో ఉందని పేర్కొంది. కాగా ఆర్థికాభివృద్ధి పోటీలో వెనుకబడిన దేశాల్లో భారత్‌తోబాటు పొరుగున ఉన్న శ్రీలంక 84వ స్థానం, బంగ్లాదేశ్ 105వ స్థానం, నేపాల్ 108వ స్థానం, పాకిస్తాన్ (110వ స్థానం) ఉన్నాయని అధ్యయన నివేదిక తెలిపింది. భారత్ ఆర్థికాభివృద్ధి ర్యాంకు కునారిల్లడం నాటకీయంగా ఉందని, ఓవైపు కొలంబియా, దక్షిణాఫ్రికా, టర్కీ వంటి దేశాలు ఏడాదిలో ఆర్థికంగా వృద్ధిని సాధించి భారత్‌ను అధిగమించాయని తెలిపింది. కాగా ప్రపంచ స్థాయిలో ఆర్థికాభివృద్ధి పోటీ సూచీ (జీసీఐ) 1079లో ఏర్పాటైనప్పటి నుంచి ఈ వార్షిక ర్యాంకింగ్‌ల కేటాయింపులు జరుగుతున్నాయి.