బిజినెస్

రైల్వేల ప్రైవేటీకరణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 13: రైళ్ల ప్రైవేటీకరణకు కేంద్రం త్వరలో పచ్చజెండా ఊపనుంది. గత కొనే్నళ్లుగా దీనిపై జరుగుతున్న విస్తృత ప్రచారం రానున్న రోజుల్లో వాస్తవంలోకి రానుంది. ఈ విధానం త్వరలో అమలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకేసారి రైళ్లు అన్నింటికీ పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించే విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఎదురయ్యే వ్యతిరేకత పరిస్థితులను గత కొంతకాలంగా అధ్యయనం చేస్తున్న భారతీయరైల్వే తన అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. దీనివల్ల చాపకింద నీరులా ఈ విధానాన్ని అమలు చేస్తూనే రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో విస్తరించే అవకాశాలు లభిస్తాయని కూడా రైల్వే భావిస్తోంది. ఆయా జోన్లు, డివిజన్లకు సంబంధించి ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో కొన్నింటిని ప్రవేశపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 18 రైల్వేజోన్లు, 50కిపైగా ఉన్న డివిజన్లకు సంబంధించి ఆదేశాల రూపంలో ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ళల్లో కొన్ని కోచ్‌లను ప్రయోగాత్మకంగా నిర్వహించాలని రైల్వే నిర్ణయించింది. ఇందుకు పలు అంశాలతో
కూడిన ఆదేశాలు త్వరలో ఆయా రైల్వేజోన్లకు రైల్వే నుంచి అందనున్నాయి. ఈవిధంగా వచ్చే ఆదేశాలు తదుపరి డివిజన్ల వారీగా వెళ్తాయి. అప్పుడు ఏవిధంగా వీటిని నిర్వహించాలి? అసలు ఒక్కో రైలుకు ఎన్ని కోచ్‌లు కేటాయిస్తారు. సూపర్‌పాస్ట్‌లు, ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్ రైళ్ళల్లో తొలిదశలో ఎనె్నన్ని నిర్వహించేందుకు అవకాశం ఉంటుందనే అంశాలను రైల్వే పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 200 కోచ్‌లను ఈ విధంగా ప్రైవేటీకరించి నడపాలని నిర్ణయించినట్టు తెలిసింది. దేశంలో ఆగ్నేయ రైల్వే, ఈస్ట్‌కోస్ట్‌రైల్వే, దక్షిణ మధ్య రైల్వేలతోపాటు అనేక ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర విభజనలో పేర్కొన్న ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పడింది. ముందుగా పెద్ద రైల్వేజోన్లకు సంబంధించి ఒక్కో డివిజన్ పరిధిలో కనీసం పది నుంచి 20కోచ్‌లను ఈ విధంగా నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. తదుపరి ప్రతి ఒక్క డివిజన్‌లో కొన్ని పాసింజర్ రైళ్ళకే ఈ విధానం పరిమితం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద రానున్న రోజుల్లో రైళ్ళల్లో కొన్ని కోచ్‌లు ప్రైవేటీకరించే పరిస్థితులపైనే రైల్వే ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఇప్పటికే దేశంలో రైల్వే జోన్ల పరిధిలో పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో రైళ్ళల్లో ఒకటి, రెండు కోచ్‌లను నిర్వహించడం జరుగుతోంది. అసౌకర్యాల కూతపై ప్రయాణికులు, పర్యాటకుల నుంచి వెల్లువెత్తే ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇకపై ఏ విధమైన ఫిర్యాదులకు అవకాశాల్లేకుండా ఐఆర్‌సిటీసీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో వౌలిక వసతులు కల్పిస్తూ వీటిని నిర్వహించాలని ఆలోచన చేస్తోంది.