బిజినెస్

దేశవ్యాప్త రుణమేళాలో రూ. 81,700 కోట్లు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఈనెల 1వ తేదీ నుంచి బ్యాంకులు దేశ వ్యాప్తంగా నిర్వహించిన తొమ్మిది రోజుల రుణమేళాలో మొత్తం రూ. 81,78 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం నాడిక్కడ వెల్లడించింది. ఈ రుణాల్లో కొత్త రుణాలు రూ. 34,342 కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌కుమార్ వివరించారు. బ్యాంకులకు అవసరమైన ద్రవ్యలభ్యత ఉందని ఈసందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలా గే మధ్య తరహా వ్యాపారులు (ఎంఎస్‌ఎంఈ) రంగంలో భారీ కార్పొరేట్ల భాగస్వామ్యంతో నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. భారీ కార్పొరేట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన ఆదాయ గణాంకాలనుబట్టి ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ. 40 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రానున్న దీపావళి పండుగలోగా ఎంఎస్‌ఎంఈలకు బకాయిలు చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.