బిజినెస్

రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఆంధ్రాబ్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: తమ బ్యాంకు నిధుల ఆధారిత రుణాల కనీస వడ్డీ రేట్ల (ఎంసీఎల్‌ఆర్)ను తగ్గించినట్టు ఆంధ్రాబ్యాంకు సోమవారం నాడిక్కడ ప్రకటించింది. ఈనెల 15 నుంచి ఈ వడ్డీరేట్లు అమలులోకి వస్తాయని, మొత్తం ఐదు రకాల కాలవ్యవధి రుణాలకు ఈ సవరించిన వడ్డీ రేట్లను వర్తింపజేస్తున్నామని అధికారులు తెలిపారు. ఒక రోజు, మాస, త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక రుణాలకు వేర్వేరుగా ఈ వడ్డీరేట్లు ఉంటాయి. ఒకరోజు (ఓవర్‌నైట్) వ్యవధి రుణాలకు 7.80 శాతం, మాస వ్యవధి రుణాలకు 7.85 శాతం, త్రైమాసిక రుణాల కు 8.05, అర్ధవార్షిక రుణాలకు 8.20 శాతం, వార్షిక రుణాలకు 3.30 శాతం వంతున వడ్డీలు వర్తిస్తాయని చీఫ్ మేనేజర్ జి. మాణిక్‌లాల్ వివరించారు.