బిజినెస్

ఐఆర్‌సీటీసీ ఆరంభ ఇష్యూ అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 14: పెట్టుబడులను పెంచుకుని తద్వారా బడ్జెట్ హోటళ్లను నెలకొల్పాలన్న లక్ష్యంతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సోమవారం విడుదల చేసిన ఐపీఓ ఆరంభ ఇష్యూతోనే అదరగొట్టింది. తొలిరోజే ఈ వాటాల విలువ ఏకంగా 27 శాతం పెరిగి ఒక్కో వాటా రూ. 728.60గా ట్రేడైంది. తొలి ఇష్యూ ధరగా ఐఆర్‌సీటీసీ ఒక్కోవాటాను రూ. 320గా ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ప్రభుత్వ రంగ కంపెనీ తొలి లిస్టింగ్‌గా విడుదలైన ఐపీఓ 112 సార్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తం రూ. 645 కోట్లమేర ఆర్జించింది. కొన్ని దశాబ్ధాలుగా ఇదే రెండో అతిపెద్ద సబ్‌స్క్రిప్షన్‌గా గణుతికెక్కింది. మొత్తం 101.25 శాతం పెరుగుదలతో వాటాల ర్యాలీ రూ. 734.80 వరకు సాగింది. ఆ తర్వాత బీఎస్‌ఈలో చివరిగా రూ.728.60గా స్థిరపడింది. మొత్తం రోజంతా ట్రేడింగ్‌లో ఈ స్టాక్ రూ. 625కు తగ్గకపోవడం విశేషం. అలాగే జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈ వాటా విలువ ఏకంగా 95.62 శాతం ఎగబాకింది. 2017 జూలైలో జరిగిన సలాసార్ ఇంజినీరింగ్ విడుదల చేసిన తొలి ఇష్యూ తర్వాత ఇదే అతిపెద్ద ఐపీఓ షోగా నమోదైంది. అప్పట్లో సలాసార్ ఇంజినీరింగ్ ఆరంభ ఇష్యూ 142 శాతం అదనంగా బలపడింది. అలాగే డీమార్ట్ రీటెయిల్ దుకాణాలను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆరంభ ఇష్యూ కూడా దాదాపు 100 శాతం అదనంగా ట్రేడైంది.