బిజినెస్

వృద్ధి రేటు 6.1 శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 15: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మంగళవారం 2019వ సంవత్సరానికి భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను 6.1 శాతానికి కుదించింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో వేసిన అంచనాతో పోలిస్తే ఇది 1.2 శాతం తక్కువ. భారత్ 2019 సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని ఐఎంఎఫ్ ఏప్రిల్‌లో ప్రకటించింది. అయితే, మూడు నెలల తరువాత అది 2019లో భారత్ వృద్ధి నెమ్మదిస్తుందని ప్రకటించడంతో పాటు అంచనా వృద్ధి రేటును 0.3 శాతం తగ్గించింది. 2018లో భారత్ వాస్తవ వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదయింది. అయితే, ఐఎంఎఫ్ తన తాజా ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్’లో 2019లో భారత్ అంచనా వృద్ధి రేటును 6.1 శాతంగా పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు వచ్చే సంవత్సరం పుంజుకొని, 7.0 శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇదిలా ఉండగా, ప్రపంచ బ్యాంకు ఆదివారం తన ‘సౌత్ ఆసియా ఎకనమిక్ ఫోకస్’ తాజా సంచికలో 2019వ సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటును 6 శాతానికి తగ్గించింది. 2018లో భారత్ 6.9 శాతం వృద్ధి సాధించిందని పేర్కొంది.