బిజినెస్

కేటీపీపీ రెండవ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపురం, అక్టోబర్ 15: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంటులో మంగళవారం సింక్రనైజేషన్ ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీన స్టీమ్ విభాగంలో సాంకేతిక సమస్యలు ఉండగా ప్లాంటును నిలిపివేశారు. అనంతరం ఇంజనీర్లు మరమ్మతులు పూర్తి చేసి ప్లాంటును ప్రారంభించే దశలో హైడల్ ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండటంతో కేటీపీపీ రెండవ దశ థర్మల్ విద్యుత్ ప్లాంటును నిలిపివేయాల్సిందిగా గ్రిడ్ నుండి సమాచారం రావడంతో అధికారికంగా ప్లాంటును నిలిపివేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంటులో మంగళవారం సింక్రనైజేషన్ ప్రారంభించారు. బుధవారం ఉదయానికల్లా పూర్తి స్థాయి 600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంటులో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. మరో 40 రోజుల పాటు ఓవరాలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కేటీపీపీ అధికార వర్గాలు తెలిపాయి.