బిజినెస్

బ్యాంకుల బంద్‌కు ఏఐటీయూసీ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఈనెల 22న చేపట్టిన అఖిల భారత బ్యాంకుల సమ్మెకు ఆలిండియాట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) బుధవారం మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బ్యాంకుల విలీన ప్రక్రియ న్యాయ సమ్మతం కాదని ఆ కార్మిక సంఘం విమర్శించింది. ఇందుకోసం ఆలిండియా బ్యాంక్ ఎంప్లారుూస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా సమ్మెకు దిగడం హర్షణీయమని ఏఐటీయూసీ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశంలోని మొత్తం ఆరు ప్రధాన బ్యాంకులను మూసివేయాలని, 10 బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దారుణం, దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం మూతపడే జాబితాలో ఉన్న ఆంధ్రాబ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, కార్పొరేట్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ప్రస్తుతం మంచి పనితీరుతో నడుస్తున్నాయని, దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయని వివరించింది. ఈ బ్యాంకులన్నింటికీ సమున్నత సుదీర్ఘ చరిత్ర కూడా ఉందని, అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు అవి ఎంతగానోశ్రమించాయని గుర్తు చేసింది. జన్‌ధన్ యోజన వంటి అనేక పథకాలను బ్యాంకులతో అనుసంధానం చేసిన ప్రభత్వం బ్యాంకులను, వాటి శాఖలను కుదించడం ద్వారా ఎలా ఆ లక్ష్యాన్ని అందుకుంటుందని ఏఐటీయూసీ ప్రశ్నించింది. అసలు బ్యాంకుల విలీనం కంటే మొండి బకాయిలను రాబట్టడంపై దృష్టి నిలపాలని, ఈ దిశగాప్రభుత్వం సీరియస్‌గా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదని విమర్శించింది.