బిజినెస్

వ్యక్తిగత అధిక సంపన్నుల ఆస్తుల వృద్ధిరేటులో మందగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 17: ఆర్థిక మాంద్యంతో వ్యక్తిగత ఐశ్వర్యవంతుల సంపద వృద్ధిరేటులో మందగమనం చోటుచేసుకుంటోంది. 2018లో ఈ వృద్ధిరేటు 13.45 శాతం నుంచి 9.62శాతానికి పడిపోయింది. ఇప్పటికీ ఆ మందగమనం కొన సాగుతూనే ఉందని ‘కార్వీ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ నిర్వహించిన అధ్యయన నివేదిక గురువారం నాడిక్కడ వెల్లడించింది. ఒక మిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులు మదుపుచేయగలిగే అదనపు నిధులు కలిగిన అధిక సంపన్నులు 2017లో 2.63 లక్షల మంది ఉండగా 2018లో ఆ సంఖ్య 2.56 లక్షలకు తగ్గిందని ఆ నివేదిక గణాంకాలు వెల్లడించాయి. కనీసం 30 మిలియన్ డాలర్ల మేర మదుపుచేయగలిగే పెట్టుబడి సామ ర్థ్యం కలిగిన ‘అల్ట్రారిచ్’ కేటగిరీకి చెందిన సంపన్నుల ఆస్తుల విలువ మాత్రం 2017లో ఉన్న రూ. 392 లక్షల కోట్ల నుంచి 2018లో రూ. 430 లక్షల కోట్లకు పెరిగింది. ఈక్రమంలో కొంతమంది సంపన్నులు మరింతగా వృద్ధిచెందుతుండగా, ప లువురు ఉన్న ఆస్తులు కోల్పోయి ఇక్కట్ల పాలవుతున్నారని నివేదిక పేర్కొంది. అధిక సంపన్న కేటగిరీ (హైనెట్‌వర్క్)కి చెందిన వ్యక్తులు ఆర్థికపరమైన ఆస్తుల రూపంలో రూ. 262 లక్షల కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నారని, మిగిలిన వారు భౌ తిక ఆస్తులను పెంచుకున్నారని నివేదిక తెలిపింది. ఈ నిష్పత్తి 60:40గా ఉందని వివరించింది. ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులు అత్యధికంగా రూ. 52 లక్షల కోట్లు సమకూరాయని, ఐతే ఈ విషయంలో వృద్ధిరేటు 2017లో ఉన్న 30.32 శాతం నుంచి 6.39 శాతానికి పడిపోయిందని ఆ నివేదిక వెల్లడించింది. అలా గే ఫిక్సెడ్ డిపాజిట్లు, బాండ్లపై పెట్టుబడులు మాత్రం 4.86 శా తం నుంచి 8.85 శాతానికి పెరిగి రూ. 45 లక్షల కోట్లకు చేరిందని నివేదించింది. అలాగే ఆర్థిక ఆస్తులు అధికంగా కలిగిన సంస్థల్లో మూడో స్థానంలో ఉన్న బీమా రంగంలో ఆస్తుల వి లువ మొత్తం రూ. 34 లక్షల కోట్ల నుంచి రూ. 36 లక్షల కోట్ల కు పెరిగింది. ఇక అధిక సంపన్నుల భౌతిక ఆస్తుల్లో పసిడి అధిక ప్రాధాన్యతను సంతరించుకుని రూ. 80 లక్షల కోట్లకు చేరింది. ఐతే రెండో అతిపెద్ద సంపదగా ఉన్న స్థిరాస్తి రంగం ఆస్తులు మాత్రం 2017లో ఉన్న 10.35 శాతం నుంచి తాజాగా 7.13 శాతానికి పడిపోయి మొత్తం విలువ రూ. 74 లక్షల కోట్లు గా ఉందని అధ్యయనం తేల్చింది. ఇలావుండగా వ్యక్తిగత సం పద 2024 నాటికి ప్రతిఏటా 13.19 శాతం పెరిగి రూ. 798 లక్ష ల కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని అంచనా వేసింది.