బిజినెస్

ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో సర్కారు భాగస్వామ్యం 51%లోపే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలను 51 శాతానికి మించకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వచ్చే కేబినెట్ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం జరగవచ్చన్న కథనా లు వెలువడడంతో ప్రభుత్వ రంగ వాటాలకు శుక్రవారం స్టాక్‌మార్కెట్లో డిమాండ్ విశేషంగా పెరిగిం ది. ఒక్క రోజే ఈ వాటాలు 22 శాతం లానపడడం గమనార్హం. ప్రధానంగా బీహెచ్‌ఈఎల్ వాటాలు అత్యధికంగా లాభపడ్డాయి. బ్రాడర్ మార్కెట్లో భా రీగా వాటాల కొనుగోళ్ల మద్దతు నెలకొంది. బీహెచ్‌ఈఎల్ నుంచి ప్రభుత్వ వాటాలను ప్రస్తుతం ఉన్న 63.2 శాతం నుంచి 26 శాతానికి తగ్గించుకోవాలని కేంద్రం నిర్ణయించిన క్రమంలో బీఎస్‌ఈలో బీహెచ్‌ఈఎల్ వాటాలు 22.22 శాతం లాభపడ్డాయి. అలా గే మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా భాగస్వామ్యాన్ని తగ్గించుకునే అవకాశాలున్నాయన్న కథనాలతో ఆ సంస్థల వాటాలకూ ఊతం లభించిం ది. ఈక్రమంలో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ 19.66 శాతం, ఎంఎంటీసీ 17.36 శాతం, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 9.31 శాతం, నేషనల్ అల్యూమినియం కంపెనీ 8.42 శాతం, సెయిల్ 7.90 శాతం, ఎన్‌బీసీసీ 7.58 శాతం, ఎన్‌ఎండీసీ 6.56 శాతం, రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ 6.04 శాతం, ఎస్‌జేవీఎన్ 5.57 శాతం, ఆయిల్ ఇండియా 5.53 శాతం లాభపడ్డాయి.