బిజినెస్

మధ్యప్రదేశ్‌లో మరింతగా పెట్టుబడులు : అంబానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, అక్టోబర్ 18: మధ్యప్రదేశ్‌లోని 45ప్రాంతాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ జాతీయ సరఫరా కేంద్రాలు (నేషనల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆ కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. మొత్తం 10 మిలియన్ చదరపుటడుగుల స్థలంలో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయన్నారు. ప్రస్తుతం తమ కంపెనీకి ఆ రాష్ట్రంలో 600 స్టోర్లు, 100 పెట్రోలియం రీటెయిల్ ఔట్‌లెట్లు ఉన్నాయని వచ్చే కొనే్నళ్లలోనే ఈ సంఖ్యను ద్విగుణీకృతం చేయాలని సంకల్పించామన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నేతృత్వంలో ఇక్కడ ‘మాగ్నిఫిసెంట్ మధ్యప్రదేశ్’ పేరిట శుక్రవారం నాడిక్కడ ఏర్పాటైన పెట్టుబడుల శిఖరాగ్ర సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. కంపెనీ బోర్డు సమావేశం శుక్రవారమే ఉండటం వల్ల తాను ప్రత్యక్షంగా సమావేశానికి హాజరుకాలేకపోయానని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్‌లో సంప్రదాయేతర ఇంధనాభివృద్ధికి సైతం తమ కృషి చేస్తుందని ఈ సందర్భంగా ముఖేష్ తెలిపారు. సుస్థిర అభివృద్ధి, సమున్నత ఆర్థికాభివృద్ధి లక్ష్యాలుగా ముందుకెళతామన్నారు. గత కొనే్నళ్లుగా ఈ రాష్ట్రంలో రూ. 20వేల కోట్ల పెట్టుబడులతో తమ సంస్థ అగ్రభాగాన నిలిచిందన్నారు. కోల్‌బెడ్ మీథేన్ బ్లాకులను రాష్ట్రంలో ఏర్పాటు చేశామని తెలిపారు.