బిజినెస్

ఒక్కరోజులో అత్యధిక మార్కెట్ విలువతో ఆర్‌ఐఎల్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) శుక్రవారం తన వాణిజ్య సామ్రాజ్య మకుటంలో మరో విజయ కలికితురాయిని నింపుకుంది. శుక్రవారం ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 9లక్షల కోట్లకు చేరడంతో కేవలం ఒక్కరోజులో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సంస్థగా రికార్డు నెలకొల్పింది. ఇంట్రాడేలో ఒకేరోజు ఈ కంపెనీ మార్కెట్ విలువ బీఎస్‌ఈలో మొత్తం రూ. 9,97,179.47 కోట్లకు పెరిగి చివరికి రూ. 8,97,179.47 కోట్ల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో ఆర్‌ఐఎల్ వా టాలు 1.37 శాతం లాభపడి ఒక్కోవాటా రూ.1,415.30గా ట్రేడైంది. గతంలో 2018 ఆగస్టులో రూ. 8లక్షల కోట్ల మార్కెట్ విలువను సంతరించుకున్న కంపెనీగా ఈ సంస్థ రికార్డుకెక్కింది. తాజాగా ఆ సంఖ్యను దాటి మరో మైలురాయిని అం దుకుంది. రెండో స్థానంలో నిలిచిన టీసీఎస్ రూ. 7,71,996.87 కోట్ల మార్కెట్ విలువను నమోదు చేసింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 6,72,466.30 కోట్లు, హెచ్‌యూఎల్ రూ. 4,55,952.72 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ. 3,61,801.97 కోట్లు, ఐటీసీ రూ. 3,02,861.98 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2,82,783.39 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ. 2,39,947.60 కోట్ల వంతున మార్కెట్ విలువలతో తదుపరి స్థానాల్లో నిలిచాయి.