బిజినెస్

ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెరగడానికి దోహదం చేసిందన్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా రాష్ట్రంలో కొత్తగా 13 లక్షల మం దికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు హైటెక్స్‌లో శుక్రవారం మ్యాక్స్‌ఎక్స్-2019 పేరిట జరిగిన సీసీఐ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. చిన్నచిన్న ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని వ్యాఖ్యానించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో యువతకు నైపుణ్యతపై శిక్షణ ఇవ్వడం వల్ల అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం పరిశ్రమల హబ్‌గా మారిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు ఇచ్చే ప్రాధాన్యం, ప్రోత్సహకాల వల్ల పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి తరలి వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సహకాలను సద్వినియోగం చేసుకొని ఎదగాలని ఆయన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సీఐఐ ఇస్తున్న అవార్డులు ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తాయన్నారు. తన కంపెనీకి బెస్ట్ ఫైనాన్సియల్ ఫర్‌పార్మర్ అవార్డు రావడం పట్ల రంజిత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.