బిజినెస్

ఆరోట్రాంచే ‘సార్వభౌమ బంగారు బాండ్ల’ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ధన్‌తేరస్‌కు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపే భారతీ య సెంటిమెంటును క్యాష్ చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఆరో ట్రాంచేగా ‘సా ర్వభౌమ బంగారు బాండ్ల’ను ప్రభుత్వం విడుదల చేసింది. సరిగ్గా ఈనెల 25న థన్‌తేరస్ పర్వదినాన ఈ సార్వభౌమ బంగారు బాండ్ల (ఎస్‌జీపీ) పథకంపై సబ్‌స్క్రిప్షన్ ము గిసేలా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఇస్యూ ధరను గ్రాముకు రూ. 3,835 వంతున నిర్ణయించినట్టు అక్టోబర్ 30న ఈ సెటిల్మెంట్లు జరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకు సం బంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసి డిజిటల్ మోడ్‌లో సొమ్ములు చెల్లించి బాండ్లు కొ నుగోలు చేసే పెట్టుబడిదారులకు గ్రాము బం గారంపై రూ. 50 డిస్కౌంటుగా ఇవ్వాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అలాంటి లావాదేవీలపై ప్రతి గ్రాము బంగారానికి రూ. 3,785 వంతున బాండ్లు ఇస్యూ చేయడం జ రుగుతుంది. కాగా ఈనెలలో వచ్చిన పండు గ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సిరీస్-5 ఎస్‌జీబీ పథకాన్ని నెలారంభంలోనే ప్రవేశపెట్టింది. భౌతికంగా బంగారు కొనుగోళ్లను తగ్గించి దేశీయంగా నగదు పొదుపును ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో ఒక గ్రాము బంగారం యూనిట్ నుంచి వివిధ రకాల తూకాలకు సంబంధించిన యూనిట్ల వరకు బాండ్ల జారీ జరుగుతోంది. ఈ పథకం కింద ఒక వ్యక్తి ఏడాదికి 500 గ్రాముల బంగారం వరకు సబ్‌స్క్రైబ్ చేసేలా పరిమితి విధించారు. హిందూ ఉమ్మడి కుటుంబాల వారికైతే 4 కిలోల వరకు, ట్రస్టులకు 20 కిలోల వరకు ఈ పథకం కింద సబ్‌స్క్రైబ్ చేసుకునే వెసులుబాటు ఉంది.