బిజినెస్

విద్యుత్ వాహనాల చార్జింగ్ కోసం యూనిట్ ధరలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: హైదరాబాద్ జంటనగరాల్లో తిరుగుతున్న విద్యుత్ వాహనాలకు చార్జింగ్ కోసం యూనిట్ ధరలను ఈఆర్‌సీ ప్రకటించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో కొత్త విద్యుత్ ధరలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.విద్యుత్ వాహనాలకు చార్జింగ్ చేసే కేటగిరిని విద్యుత్ శాఖ 9వ కేటగిరిలో చేర్చింది. విద్యుత్ చార్జీలను పగలు, రాత్రి సమయాల్లో మూడు కేటగిరిలుగా నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరక విద్యుత్ (పీక్) యూనిట్ ధర రూ.7 రూపాయలు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ. 6 రూపాయలు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు (నాన్ పీక్) రూ.5 రూపాయలుగా వసూళ్లు చేయాలని ఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో విద్యుత్ వాహనాల కోసం విద్యుత్ రీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని ఈఆర్‌సీ సూచించింది.