బిజినెస్

బాండ్ల ద్వారా 450 మిలియన్ డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 22: గోల్డ్‌లోన్ ఫైనాన్షియల్ దిగ్గజం ముత్తూట్ పైనాన్స్ మూడేళ్ల డాలర్ బాండ్ల విక్రయాల ద్వారా 50 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. ఇందుకోసం 6.125 శాతం వార్షిక కూపన్‌ను ఆ కంపెనీ ఆఫర్ చేసింది. ఇలా ఓ బంగారు రుణాల కంపెనీ డాలర్ రుణ మార్కెట్‌లోకి ప్రవేశించడం మనదేశంలో ఇదే తొలిసారి. అమెరికాలోని ప్రవాస భారతీయ మదుపర్ల కోసం ఉద్దేశించిన ‘రెగ్ ఎస్’ ఇస్యూ 117 అకౌంట్ల నుంచి 1.2 బిలియన్ డాలర్ల ఆర్డర్ బుకింగ్‌లను రాబట్టింది. ఇందుకు సంబంధించి అత్యధికంగా మదుపర్ల ఆసక్తి అమెరికా నుం చి (35 శాతం) రాగా, ఐరోపా, మధ్య ఈశాన్య దేశా ల నుంచి 28 శాతం, ఆసియా దేశాల నుంచి 27 శాతం వచ్చినట్టు ముత్తూట్ ఫైనా న్స్ ప్రమోటర్, చైర్మన్ ఎంజీ జార్జి ముత్తూట్ మంగళవారం నాడిక్కడ తెలిపారు. తమ కంపెనీ ఘత చరిత్ర పరితీరే తమ రుణ అంతర్జాతీయ బాండ్లకు మంచి స్పందన వచ్చేలా చేసిందని ఆయన చెప్పారు. ఆర్‌బీఐ, ఈసీబీ మార్గదర్శకాలతోబాటు సంబంధిత ఇతర చట్టాలను ఇందుకు సంబంధించి తమ కంపెనీ అనుసరిస్తోందన్నారు. ఈ నిధులను తమ సంస్థ ప్రగతికి వినియోగిస్తామని, ఇది తమకు తదుపరి నిధుల సమీకరణకు ప్రోత్సాహాన్నించిందని ఆయన చెప్పారు.