బిజినెస్

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలకు అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 22: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం చేపట్టిన దేశవ్యాప్త ఒక రోజు సమ్మె కారణంగా బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడింది. కేంద్రం చేపట్టిన బ్యాంకుల విలీన కార్యక్రమాన్ని వ్యితిరేకిస్తూ ఈ ఆందోళన కార్యక్రమం సాగింది. గత ఆగస్టులో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మార్చనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐతే ఎంతో చరిత్ర కలిగి అద్భుతంగా పనిచేస్తున్న బ్యాంకులను కూడా ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం వెల్లడించాలని ఈ సందర్భంగా అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఐఏ) ప్రశ్నించింది. ఇప్పటికే ఎస్‌బీఐ, దేనా బ్యాంకుల అనుబంధ బ్యాంకులతో విలీనం జరిగిందని, అలాగే విజయా బ్యాంకు బరోడా బ్యాంకుతో విలీనమైందని గుర్తు చేసింది. మళ్లీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కలిపేందుకు, సిండికేట్ బ్యాంకుతో కెనరాబ్యాంక్‌ను, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను, కార్పొరేషన్ బ్యాంకుతో ఆంధ్రాబ్యాంకును విలీనం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలిపింది. ఈక్రమంలో దాదాపు రెండువేల బ్యాంకు శాఖలు మూతపడే ప్రమాదం నెలకొందని, ఉద్యోగులు, ఖాతాదారుల ప్రయోజనాలకు భంగం కలిగేలా ఉన్న ఈ విలీన చర్యలకు స్వస్తిపలకాలని ఏఐబీఈఏ డిమాండ్ చేసింది. అలాగే భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్‌ఐ) సైతం ఈ సమ్మెలో పాల్గొంది.
అయతే ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు, ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. గతంలో సెప్టెంబర్ 26,27 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మె చేపడతామని బ్యాంకు అధికారుల సంఘం ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వ జోక్యంతో ఆ ప్రయత్నాన్ని విరమించడం జరిగింది.

*చిత్రం...సమ్మెలో భాగంగా చెన్నైలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న బ్యాంకర్లు