బిజినెస్

ఢిల్లీకి ఎగుమతి కానున్న టమోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, అక్టోబర్ 22: పల్లెల్లో సాగుచేసిన టమోటా పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఢిల్లీకి ఎగుమతి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు ఆయా మార్కెట్లకు అన్నిరకాల కూరగాయలు, టమోటాల కొనుగోలు, వాటి మార్కెటింగ్, కూలీ తదితర వివరాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారు. మార్కెటింగ్ శాఖ పరిధిలోని యార్డులలో కమీషన్ ఏజన్సీ వ్యవస్థను రద్దు చేసింది. ఇటీవల రాష్ట్రంలోని పత్తికొండ మార్కెట్‌లో ప్రైవేట్ మార్కెట్ వ్యాపారులు చేసిన తప్పిదంతో టమోటా రైతులు మోసపోయారని, దీంతో వారి మధ్య చెలరేగిన వివాదంతో ధరలు తగ్గుముఖం పట్టగా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌లలో టమోటాతో పాటు అన్ని రకాల కూరగాయలు కొనుగోలుకు చర్యలు చేపట్టిందని మదనపల్లె మార్కెట్ సెక్రటరీ జగదీష్ వెల్లడించారు. పల్లెల్లో రైతులు పండించే పంటలు మార్కెటింగ్‌తో ప్రమేయం లేకుండా, ఎలాంటి కమీషన్ లేకుండా నేరుగా ఎగుమతి చేసేందుకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్స్ (ఎఫ్‌పీవో)లు మార్కెటింగ్‌శాఖ అనుమతితో ఎగుమతులు చేస్తుంటారు. అలాంటి ఎఫ్‌పీవోలు జిల్లాలోని మదనపల్లె మార్కెటింగ్ పరిధిలో రెండు, పుంగనూరు మార్కెట్ పరిధిలో రెండు, గుర్రంకొండలో రెండు, కలికిరిలో రెండు, పలమనేరు మార్కెటింగ్ పరిధిలో 16 ఎఫ్‌పీవోల బృందాలు నమోదు చేసుకుని ఎగుమతులు చేస్తున్నారు.
టమోటాతో పాటు 18 రకాల కూరగాయల పంటలు ఎగుమతి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టమోటాలు కొనుగోలు చేసి ఢిల్లీ ఎగుమతికి అయ్యే ఖర్చులు, సమయం, ధరలు వంటి వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని మదనపల్లె వ్యవసాయ మార్కెటింగ్ సెక్రటరీ జగదీష్ వెల్లడించారు. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతున్నామని ఆయన తెలిపారు. ఎఫ్‌పీవోలు పంటలను రైతుల నుంచి నేరుగా కానీ, మార్కెట్‌లో ఈనామ్ ద్వారా కానీ కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. అయితే ఇందుకు ఎలాంటి కమీషన్, రవాణా ఖర్చులు రైతులపై భారం పడదన్నారు. ప్రధానంగా మంగళవారం స్థానిక మార్కెట్‌యార్డు సెక్రటరీ జగదీష్‌తో ఎఫ్‌పీవో బృందం సమావేశమైంది. ప్రస్తుతం మార్కెట్‌లో టమోటా ధరలు, మార్కెటింగ్ విధానం, రోజుకు సగటు దిగుమతి టమోటాలు వంటి వాటిపై చర్చించారు. ఎలాంటి కమీషన్ లేకుండా పండించిన పంటలను రైతుల నుంచి నేరుగా ఎఫ్‌పీవోలు టమోటా కొనుగోలు చేసి ఢిల్లీకి ఎగుమతి చేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు.