బిజినెస్

లాభాల పరుగుకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవోపై అవినీతి ఆరోపణలు రావడంతో మంగళవారం ఒక్క సారిగా ఆ కంపెనీ వాటాలు 16 శాతం నష్టపోయి మొత్తం దేశీయ స్టాక్‌మార్కెట్లను నష్టాల్లోకి లాగాయి. వరుసగా ఆరు రోజులు లాభాల్లో సాగి ఊపుమీదున్న స్టాక్ మార్కెట్లకు ఇలా అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 334.54 పాయింట్లు కోల్పోయి 0.85 శాత నష్టాలతో 38,924.85 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌సీ సూచీ నిఫ్టీ సైతం 73.50 పాయింట్లు (0.63శాతం) నష్టపోయి 11,588.35 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. కాగా ఇన్ఫోసిస్‌లోని కొంతమంది అజ్ఞాత ఉద్యోగుల బృందం కంపెనీ బోర్డుకు, ప్రభుత్వానికి రాసిందిగా చెబుతున్న లేఖలోప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్‌పై అవినీతి ఆరోపణలు గుప్పించడం సంచనం సృష్టించింది. త్రైమాసిక నివేదికలో అనేక అంశాలను దాచిపెట్టారని, ఈ విషయంలో గోప్యం పాటించని ఉద్యోగులను బయటకు పంపారన్నది ప్రధాన ఆరోపణలు. అలాగే లెక్కలు తారుమారు చేసి లాభాలు చూపారన్న సైతం మరో తీవ్ర ఆరోపణ. దీనిపై విచారణకు ఆదేశించినట్టు కంపెనీ ప్రకటించినప్పటికీ మంగళవారం స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీకి తీవ్ర ప్రతికూలతలు ఎదురయ్యాయి. ఏకంగా 16.21 శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్ వాటా ఆరేళ్ల కనిష్ట స్థాయి రూ.643.30కి పడిపోయింది. అలాగే కంపెనీ మార్కెట్ విలువ సైతం రూ. 53,451 కోట్లమేర తగ్గిపోయింది. ఈక్రమంలో తొలుత సానుకూలంగానే ఆరంభమైన స్టాక్ మార్కెట్లకు ఆ తర్వాత చుక్కెదురైంది. మదుపర్లు ఆచితూచి వ్యవహరించడమే ఇందుకు కారణం. టాటామోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ సైతం భారీగా 3.05 శాతం మేర నష్టాలను సంతరించుకున్నాయి. ఇక రంగాల వారీగా చూస్తే ఇన్ఫోసిస్ ప్రతికూలతలతో బీఎస్‌ఈలో ఐటీ, టెక్ తీవ్రంగా 7 శాతం మేర నష్టాలపాలయ్యాయి. టెలికాం, లోహ, వాహన రంగాలు సైతం నష్టపోయాయి. మరోవైపుబీఎస్‌ఈ హెల్త్‌కేర్, వినిమయ వస్తువులు, బ్యాంకెక్స్, ఫైనాన్స్, చమురు, సహజవాయువులు, శీఘ్ర విక్రయ వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ), స్థిరాస్తి సూచీలు 1.56 శాతం లాభపడ్డాయి. ఇక బ్రాడర్ మార్కెట్లలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.09 శాతం నష్టపోగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.48 లాభపడింది. ఇన్ఫోసిస్‌లో చోటుచేసుకున్న పరిణామాలతోనే ఐటీ స్టాక్స్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని, అందుకే సెనె్సక్స్ 39వేల పాయింట్ల దిగువకు చేరిందని విశే్లషకులు పేర్కొంటున్నారు. ఐతే మహారాష్ట్ర, హర్యానాల్లో మళ్లీ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న ఎగ్జిట్‌పోల్స్ సర్వేల కారణంగా దేశ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల వైఖరి రావడంతో బ్యాంకింగ్ స్టాక్స్ లాభపడ్డాయని ప్రముఖ విశే్లషకుడు పరాస్‌బోత్రా తెలిపారు.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
చైనాతో పాక్షిక వాణిజ్య ఒప్పందం దాదాపుగా కదిరిందని, వచ్చే నెలలో ఇందుకు సంబంధించి సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత సానుకూలత చేకూరింది. ఈక్రమంలోనే ఆసియా ఖండంలో షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఐతే ఐరోపా మార్కెట్లు మాత్రం ఆరంభ ట్రేడింగ్‌లో మిశ్రమ ఫలితాలనే నమోదు చేశాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం 20 పైసలు బలపడి ఇంట్రాడేలో 70.94గా ట్రేడైంది. ముడిచమురు ధరలు 0.36 శాతం పెరిగి బ్యారెల్ 59.117 డాలర్ల వంతున ట్రేడైంది.