బిజినెస్

‘విజిల్‌బ్లోయర్స్’ లేఖపై ఎందుకు గోప్యత పాటించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: భారత స్టాక్ మార్కెట్ ఎక్చేంజ్ (బీఎస్‌ఈ) ఇన్ఫోసిస్ వ్యవహారంలో గోప్యతలపై గుర్రుగా ఉంది. కంపెనీ శ్రేయోభిలాష ఉద్యోగుల బృందం (విజిల్‌బ్లోయర్స్) పేరిట వెలువడిన కంపెనీ అత్యున్నత కార్యనిర్వాహకులపై తీవ్ర స్థాయి ఆరోపణలతో కూడిన లేఖ, ఫిర్యాదుల విషయాలను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందో వివరించాలంటూ ఇన్ఫోసిస్‌ను బీఎస్‌ఈ ఆదేశించింది. అనూహ్యంగా భారీ స్ధాయిలో వాటాల విక్రయాలకు కారణమైన అజ్ఞాత ఉద్యోగుల బృంద లేఖలపై ఇన్ఫోసిస్ యాజమాన్యం ఎందుకు గోప్యత పాటించాల్సి వచ్చిందన్న విషయంలో స్టాక్ ఎక్స్ఛేంజీకి స్పష్టత రావాల్సి ఉంది. ‘నైతిక ఉద్యోగుల బృందం’ పేరిట వెలువడిన మరోలేఖలోకంపెనీ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌ఓ నీలాంజన్ రాయ్ పలు అనైతిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇలావుండగా మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేయించి నిగ్గుదేలుస్తామని కంపెనీ చైర్మన్ ప్రకటించిన క్రమంలో మళ్లీ వాటాలు కోలుకున్నాయి.
బీఎస్‌ఈలో బుధవారం 1.16 శాతం లాభపడిన ఈ ఐటీ దిగ్గజ కంపెనీ వాటా విలువ రూ.650.75 గరిష్ట స్ధాయికి చేరింది. ఇంట్రాడేలో దాదాపు 2 శాతం అదనంగా ఎగబాకి రూ.656.40కు చేరుకుని తర్వాత కొంత దిద్దుబాటుకు గురైంది. మంగళవారం ఈ కంపెనీ వాటాల విలువ 17 శాతం మేర భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.